డైరెక్షన్ మొత్తం ఆన్‌లైన్‌లో చూసే నేర్చుకున్నా

  రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన రియలిస్టిక్ ఫిలిం ‘బీచ్ రోడ్ చేతన్’. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సంధర్భంగా చేతన్ మద్దినేనితో ఇంటర్వూ విశేషాలు యాక్షన్ థ్రిల్లర్… ‘బీచ్ రోడ్ చేతన్’ ఒక రియలిస్టిక్ రా ఎంటర్ టైనర్. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్. ఇక నాకు […] The post డైరెక్షన్ మొత్తం ఆన్‌లైన్‌లో చూసే నేర్చుకున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన రియలిస్టిక్ ఫిలిం ‘బీచ్ రోడ్ చేతన్’. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సంధర్భంగా చేతన్ మద్దినేనితో ఇంటర్వూ విశేషాలు

యాక్షన్ థ్రిల్లర్…
‘బీచ్ రోడ్ చేతన్’ ఒక రియలిస్టిక్ రా ఎంటర్ టైనర్. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్. ఇక నాకు ఎప్పటినుండో ఒక మంచి యాక్షన్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేయాలనే కోరిక ఉంది. ఆ క్రమంలో చేసిందే ఈ సినిమా. నిజానికి నాకు మొదటి నుంచీ డైరెక్షన్ మీద ఆసక్తి ఉంది.

అందుకే ఫ్రీగా ప్రీమియర్ షోలు…
ఈరోజుల్లో చిన్న చిత్రాలను ఎవ్వరూ పట్టించుకోరు. పట్టించుకోవాలంటే ఆన్‌లైన్‌లో ఆ మూవీ టీజర్‌నో ట్రైలర్‌నో వైరల్ అవ్వాలి. అలా వైరల్ అయ్యే కంటెంట్ ఈ సినిమాలో లేదు. అయితే ఈ సినిమా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ కావాలి. వాళ్లకు ఈ సినిమా గురించి బాగా తెలియాలనే ఉద్దేశ్యంతో ఫ్రీగా ప్రీమియర్ షోలు వేయడం జరుగుతోంది.

మార్నింగ్ షో టికెట్లు ఫ్రీగా…
ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో టికెట్లను థియేటర్స్ దగ్గరే ఫ్రీగా ఇస్తాము. ఇక మల్టీప్లెక్స్‌ల్లో మా సినిమా ఏజెంట్ ఉంటాడు. అతను టికెట్స్ ఇస్తాడు. ఒకవేళ బుక్ మై షోలో ఎవరైనా టికెట్స్ ముందుగానే బుక్ చేసుకుంటే.. థియేటర్ దగ్గర మా సినిమా ఏజెంట్‌ను కలిస్తే అతను టికెట్ డబ్బును వెనక్కి ఇచ్చేస్తాడు.

ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకున్నా
డైరెక్షన్ పరంగా నాకు అనుభవం లేదు. కానీ డైరెక్షన్ మొత్తం ఆన్‌లైన్‌లో చూసే నేర్చుకున్నాను.డైరెక్షన్ ఎలా చేయాలి? షాట్ మేకింగ్ గురించి… ఇలా 24 క్రాఫ్ట్ లకు సంబంధించి ఆన్‌లైన్‌లోనే చూసి నేర్చుకున్నాను.

తదుపరి చిత్రాలు…
రెండు సబ్జెక్టులు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి హారర్ కామెడీ స్టోరీ కాగా మరొకటి యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

Interview with Chetan Maddineni

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డైరెక్షన్ మొత్తం ఆన్‌లైన్‌లో చూసే నేర్చుకున్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: