గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలి: సూపర్‌స్టార్ కృష్ణ

  సినీ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ ఆకాంక్ష హీరోలు పవన్‌కళ్యాణ్, సూపర్‌స్టార్ రజనీకాంత్, వెంకటేష్‌లకు గ్రీన్‌ఛాలెంజ్ విసిరిన కృష్ణ వ్యవసాయ క్షేత్రంలో 50 మొక్కలు నాటిన మనోహర్‌రెడ్డి హైదరాబాద్ : త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని సినీ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ ఆకాంక్షించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం ఆయన మూడు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటడంతో పాటు వాటిని […] The post గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలి: సూపర్‌స్టార్ కృష్ణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సినీ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ ఆకాంక్ష
హీరోలు పవన్‌కళ్యాణ్, సూపర్‌స్టార్ రజనీకాంత్, వెంకటేష్‌లకు
గ్రీన్‌ఛాలెంజ్ విసిరిన కృష్ణ
వ్యవసాయ క్షేత్రంలో 50 మొక్కలు నాటిన మనోహర్‌రెడ్డి

హైదరాబాద్ : త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని సినీ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ ఆకాంక్షించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం ఆయన మూడు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని హరితహారంగా మార్చడంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు ఎంపి సంతోష్ కుమార్‌ను కృష్ణ అభినందించారు. హీరోలు పవన్‌కళ్యాణ్, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ , హీరో వెంకటేష్‌లకు సూపర్ స్టార్ కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మొక్కలు నాటే కార్యక్రమంలో కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సింగర్ రేవంత్, యాంకర్ శ్యామలకు గ్రీన్‌ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన నల్ల మనోహర్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి సింగర్ రేవంత్‌కు, యాంకర్ శ్యామల, టిఆర్‌ఎస్ యువనాయకులు చందుపట్ల సునీల్‌రెడ్డి, తెలుగుయాక్టర్ సర్ధార్‌లకు గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు. గ్రీన్‌చాలెంజ్‌ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎంపి సంతోష్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే హరిత భారతదేశం, హరిత తెలంగాణ సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

టిఆర్‌ఎస్‌వి నాయకుడు శ్రవణ్ ఆధ్వర్యంలో…
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్‌లో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. ఉప్పల్ నియోజకవర్గం టిఆర్‌ఎస్‌వి నాయకుడు శ్రవణ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలు నాటి గ్రీన్‌చాలెంజ్‌ను స్వీకరించారు.

నటుడు కృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపి సంతోష్‌కుమార్
గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సూపర్‌స్టార్ కృష్ణకు రాజ్యసభ ఎంపి సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వయస్సులో కూడా కృష్ణ గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఒక సామాజిక ఉద్యమంలా గ్రీన్‌ఛాలెంజ్‌ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

The Green Challenge should reach 10 crores

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలి: సూపర్‌స్టార్ కృష్ణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: