గృహ నిర్మాణ పనులపై మంత్రి సబితారెడ్డి సమీక్ష

  హైదరాబాద్: జిల్లా గృహ నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి సబితారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇండ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మించాలనే సిఎం కెసిఆర్ ఆశయం మేరకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సబితా అన్నారు. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 6,777 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు కాగా 2,972 ఇండ్లకు టెండర్ ప్రక్రియ ముగియగా 2,407 ఇండ్ల పనులు ప్రారంభించామని తెలిపారు. మిగితా వాటికి టెండర్ […] The post గృహ నిర్మాణ పనులపై మంత్రి సబితారెడ్డి సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: జిల్లా గృహ నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి సబితారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇండ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మించాలనే సిఎం కెసిఆర్ ఆశయం మేరకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సబితా అన్నారు. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 6,777 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు కాగా 2,972 ఇండ్లకు టెండర్ ప్రక్రియ ముగియగా 2,407 ఇండ్ల పనులు ప్రారంభించామని తెలిపారు. మిగితా వాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని, నివాస యోగ్యమైన స్థలాలను ఎంపిక చేసి టెండర్లు నిర్వహించేటప్పుడు స్థానిక ఎంఎల్ఎలకు సమాచారం ఇచ్చి వారి చేత కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాల కోసం రూ.84 కోట్లు అవసరమవుతాయని అందుకు సంబంధించిన నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సబితా అధికారులను అందేశించారు. పనుల పరోగతిపై 15 రోజుల్లో ఎంఎల్ఎలతో కలిసి ఒక తుది రూపం తేవాలని అందుకోసం మరోసారి సమావేశం నిర్వహిస్తామని మంత్రి సబితా రెడ్డి తెలియజేశారు.

Sabitha Reddy review on Housing construction works

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గృహ నిర్మాణ పనులపై మంత్రి సబితారెడ్డి సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: