గోదావరి జలాలతో కోహెడ నేల తడవాలి

  సిద్దిపేట : గోదావరి జలాలతో కోహెడ నేల తడవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం కోహెడ మండలంలోని బస్వాపూర్‌లో రూ. 1.50 కోట్లతో సబ్‌స్టేషన్, రూ. 19.38 లక్షలతో కార్యాలయ భవనం, రూ. 12 లక్షలతో మహిళా సమైఖ్య భవనం, వెంకటేశ్వరపల్లిలో రూ. 30 లక్షలతో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ భవనం, అలాగే కోహెడ మండల కేంద్రంలో రూ. 19.14 లక్షలతో నిర్మించిన సబ్‌స్టేషన్ ఎఇ కార్యాలయ భవనాలను హుస్నాబాద్ […] The post గోదావరి జలాలతో కోహెడ నేల తడవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిద్దిపేట : గోదావరి జలాలతో కోహెడ నేల తడవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం కోహెడ మండలంలోని బస్వాపూర్‌లో రూ. 1.50 కోట్లతో సబ్‌స్టేషన్, రూ. 19.38 లక్షలతో కార్యాలయ భవనం, రూ. 12 లక్షలతో మహిళా సమైఖ్య భవనం, వెంకటేశ్వరపల్లిలో రూ. 30 లక్షలతో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ భవనం, అలాగే కోహెడ మండల కేంద్రంలో రూ. 19.14 లక్షలతో నిర్మించిన సబ్‌స్టేషన్ ఎఇ కార్యాలయ భవనాలను హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంబోత్సవానికి వచ్చిన మంత్రి హరీష్ రావుకు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలుకుతు, బొట్టుపెట్టి మహిళలు మంగళహారతులు పట్టారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… 30 రోజుల ప్రణాళికలో గ్రామాలన్ని చూడ ముచ్చటగా మారయన్నారు.

ఇదే స్పూర్తితో సర్పంచులు, ఎంపిటిసీిలు, వార్డుసభ్యులు ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక తప్పనిసరిగా నిర్మించుకోవాలని కోరారు. మీ గ్రామాల్లో ఏం అభివృద్ధి చేయాలో చెబితే, వాటికి అనుగుణంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కోట్లాది రూపాయలతో మిషన్ భగిరథతో ఇంటింటికి త్రాగునీరును అందిస్తున్నామని, నీటి వృధా చేయకుండా మహిళలే బాధ్యత తీసుకోవాలన్నారు. కోహెడ మండలంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. శనిగరం, సింగరాయ ప్రాజెక్టుల పుననిర్మిణం, చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

రానున్న రోజుల్లో అన్ని సౌకర్యాలతో కోహెడ మరింత అభివృద్ధి చెందేవిధంగా ప్రత్యేకంగా దృష్టి పెడ్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం కోహెడ గ్రామ పంచాయతీ కార్యాలయన్ని మంత్రి హరీష్ రావు సందర్శించి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో జడ్పి చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రాఘోత్తం రెడ్డి, ఎంపిపి కొక్కుల కీర్తి సురేష్, జడ్పిటిసి నాగరాజు శ్యామల, ఎఎంసీ చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు, వైస్‌ఎంపిపి తడకల రాజిరెడ్డి, సర్పంచులు పేర్యాల నవ్య, తోట భాగ్యలక్ష్మి, సత్తయ్య, ఎంపిటిసి ఖమ్మం స్వరూపవెంకటేశం ఆయా శాఖల అధికారులు తదితరులున్నారు.

Minister Harish Rao’s visit in Koheda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గోదావరి జలాలతో కోహెడ నేల తడవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: