నేడు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం

  హైదరాబాద్ : కోసాంధ్ర, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, దీంతోపాటు పిడుగులు పడే ప్రమాదముందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అసోం, మేఘాలయ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపిస్తుందని అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో తెలంగాణలో మంగళవారం రాత్రి, బుధవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం నుంచి ఉత్తర తమిళనాడు తీరం నైరుతి బంగాళాఖాతం […] The post నేడు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : కోసాంధ్ర, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, దీంతోపాటు పిడుగులు పడే ప్రమాదముందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అసోం, మేఘాలయ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపిస్తుందని అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో తెలంగాణలో మంగళవారం రాత్రి, బుధవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం నుంచి ఉత్తర తమిళనాడు తీరం నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో 1.5 కి.మీల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

Rainfall likely across the state

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: