కౌలు రైతులకు ఎపి ప్రభుత్వం గుడ్ న్యూస్..

  అమరావతి: కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని రైతులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఇస్తున్నట్టుగానే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ భూముల కౌలు రైతులు, సొసైటీల రైతులకు రైతు భరోసా పథకం వర్తించనుంది. దేశంలోనే తొలిసారిగా ఎపిలో కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని […] The post కౌలు రైతులకు ఎపి ప్రభుత్వం గుడ్ న్యూస్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని రైతులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఇస్తున్నట్టుగానే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ భూముల కౌలు రైతులు, సొసైటీల రైతులకు రైతు భరోసా పథకం వర్తించనుంది. దేశంలోనే తొలిసారిగా ఎపిలో కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బును జమచేశామని పేర్కొన్నారు. అర్హత కలిగిన రైతులందరికీ ప్రతి ఏటా 13,500 పెట్టుబడి సాయం అందుతుందని మంత్రి చెప్పారు.

AP Govt Said good news to Tenant Farmers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కౌలు రైతులకు ఎపి ప్రభుత్వం గుడ్ న్యూస్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: