బాపట్ల మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

గుంటూరు : బాపట్ల మాజీ ఎంఎల్ఎ ముప్పలనేని శేషగిరిరావు (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా  ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడుగా ఉన్నారు. 1994 లో టిడిపి నుంచి బాపట్ల ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. 1982-85 మధ్య ఆయన ఎంఎల్ సిగా కూడా పని చేశారు.  1999 ఎన్నికల్లో శేషగిరిరావుకు టిడిపి టికెట్ రాలేదు. దీంతో ఆయన […] The post బాపట్ల మాజీ ఎంఎల్ఎ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గుంటూరు : బాపట్ల మాజీ ఎంఎల్ఎ ముప్పలనేని శేషగిరిరావు (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా  ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడుగా ఉన్నారు. 1994 లో టిడిపి నుంచి బాపట్ల ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. 1982-85 మధ్య ఆయన ఎంఎల్ సిగా కూడా పని చేశారు.  1999 ఎన్నికల్లో శేషగిరిరావుకు టిడిపి టికెట్ రాలేదు. దీంతో ఆయన టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 2004 లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆయన  పనిచేశారు. శేషగిరిరావు మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Bapatla Ex MLA Seshagiri Rao Passed Away

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాపట్ల మాజీ ఎంఎల్ఎ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: