సెమీస్‌లో జ్వరేవ్

లండన్: ప్రతిష్టాత్మకమై ఎటిపి టూర్ ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జర్మనీ స్టార్ ఆటగాడు, ఏడో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. కచ్చితంగా గెలవాల్సిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించాడు. ఈ గెలుపుతో నాదల్‌ను వెనక్కి నెట్టి జ్వరేవ్ సెమీస్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో జ్వరేవ్ 64, 76తో విజయం సాధించాడు. తొలి సెట్‌లో మెద్వెదేవ్ […] The post సెమీస్‌లో జ్వరేవ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: ప్రతిష్టాత్మకమై ఎటిపి టూర్ ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జర్మనీ స్టార్ ఆటగాడు, ఏడో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. కచ్చితంగా గెలవాల్సిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించాడు. ఈ గెలుపుతో నాదల్‌ను వెనక్కి నెట్టి జ్వరేవ్ సెమీస్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో జ్వరేవ్ 64, 76తో విజయం సాధించాడు. తొలి సెట్‌లో మెద్వెదేవ్ ఆరంభంలో ఆధిపత్యం చెలాయించాడు. కానీ, కీలక సమయంలో జ్వరేవ్ పుంజుకున్నాడు. ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో అద్భుత షాట్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు.

చివరి వరకు జోరును కొనసాగిస్తూ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, రెండో సెట్‌లో మెద్వెదేవ్ దూకుడుగా ఆడాడు. కళ్లు చెదిరే షాట్లతో లక్షం దిశగా అడుగులు వేశాడు. కానీ, జ్వరేవ్ కూడా పట్టు వీడకుండా పోరాడాడు. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు నిలకడగా ఆడిన జ్వరేవ్ విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థిమ్, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్, గ్రీక్ సంచలనం సిట్సిపాస్‌లు కూడా సెమీస్ బెర్త్‌ను ఒంతం చేసుకున్నారు.

Alexander Zverev advances to semis

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సెమీస్‌లో జ్వరేవ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: