మహిళ కానిస్టేబుల్‌పై కానిస్టేబుల్ అత్యాచారం…

  భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిషా జిల్లాలోని నజీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ కానిస్టేబుల్‌పై కానిస్టేబుల్ అత్యాచారం చేసిన ఆరు నెలల తరువాత ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళ కానిస్టేబుల్ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తోంది. మార్గం మధ్యంలో తన చెల్లెలు కోసం ఎదురు చూస్తోంది. తనతో పని చేసిన ఆనంద్ గౌతమ్ అనే కానిస్టేబుల్ ఆమెకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. జూన్ 15న […] The post మహిళ కానిస్టేబుల్‌పై కానిస్టేబుల్ అత్యాచారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిషా జిల్లాలోని నజీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ కానిస్టేబుల్‌పై కానిస్టేబుల్ అత్యాచారం చేసిన ఆరు నెలల తరువాత ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళ కానిస్టేబుల్ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తోంది. మార్గం మధ్యంలో తన చెల్లెలు కోసం ఎదురు చూస్తోంది. తనతో పని చేసిన ఆనంద్ గౌతమ్ అనే కానిస్టేబుల్ ఆమెకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. జూన్ 15న జోహార్ చౌక్‌లో ఓ హోటల్ కు ఆమెను తీసుకెళ్లాడు. ఆమె వాష్‌రూమ్‌కు వెళ్లగానే కూల్ డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి ఇచ్చాడు. ఆమెకు స్పృహ లేకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసి వీడియో తీశాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని లేకపోతే వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. దీంతో మహిళ కానిస్టేబుల్ స్థానిక ఎస్‌పికి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు.

 

Constable Rape on Collegue with Drug in Bhopal

The post మహిళ కానిస్టేబుల్‌పై కానిస్టేబుల్ అత్యాచారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: