నూతన ఆవిష్కరణలు చేయాలి : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌ : నిజాం కళాశాల మైదానంలో బయోటెక్నాలజీ జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రారంభించి మాట్లాడారు.  బయోటెక్నాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి – భవిష్యత్‌ అవకాశాలపై ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రతి రంగంలో ఆవిష్కరణలు జరగాలని ఆమె పేర్కొన్నారు. పలు అంశాలపై విద్యార్థులు పరిశోధనలు చేయాలని ఆమె సూచించారు. మెడిసిన్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సమయంలోనే తనకు వివాహం జరిగిందని, అయినప్పటికీ తన […] The post నూతన ఆవిష్కరణలు చేయాలి : గవర్నర్ తమిళిసై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : నిజాం కళాశాల మైదానంలో బయోటెక్నాలజీ జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రారంభించి మాట్లాడారు.  బయోటెక్నాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి – భవిష్యత్‌ అవకాశాలపై ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రతి రంగంలో ఆవిష్కరణలు జరగాలని ఆమె పేర్కొన్నారు. పలు అంశాలపై విద్యార్థులు పరిశోధనలు చేయాలని ఆమె సూచించారు. మెడిసిన్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సమయంలోనే తనకు వివాహం జరిగిందని, అయినప్పటికీ తన చదువును ఆపలేదని ఆమె చెప్పారు. జీవసాంకేతిక రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, హైదరాబాద్ లో మెడికల్ సైన్సెస్, ఫార్మసీ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆర్యోగవంతులుగా ఉంటారని, ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగిందని ఆమె తెలిపారు.

Commencement Of National Conference On Biotechnology

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నూతన ఆవిష్కరణలు చేయాలి : గవర్నర్ తమిళిసై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: