అర్ధరాత్రి విద్యార్థినిని ఇంటికి రమ్మన్న యూనివర్సిటీ ప్రొఫెసర్

  రుద్రనగర్: తన భార్య ఇంట్లో లేదని, ఇంటికి వచ్చి వంట చేయాలంటూ అర్ధరాత్రి ఒక విద్యార్థినికి జిబి పంత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు ఫోన్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్‌లో ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని యూనివర్సిటీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో వైస్ చాన్సలర్ ఎదుట ప్రస్తావించిందని, అయితే లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వకపోవడంతో సంబంధిత ప్రొఫెసర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పంత్ యూనివర్సిటీ విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ డాక్టర్ సలీల్ తివారీ […] The post అర్ధరాత్రి విద్యార్థినిని ఇంటికి రమ్మన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రుద్రనగర్: తన భార్య ఇంట్లో లేదని, ఇంటికి వచ్చి వంట చేయాలంటూ అర్ధరాత్రి ఒక విద్యార్థినికి జిబి పంత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు ఫోన్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్‌లో ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని యూనివర్సిటీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో వైస్ చాన్సలర్ ఎదుట ప్రస్తావించిందని, అయితే లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వకపోవడంతో సంబంధిత ప్రొఫెసర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పంత్ యూనివర్సిటీ విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ డాక్టర్ సలీల్ తివారీ తెలిపారు. తమ హాస్టల్ వార్డన్‌గా బాధ్యతలు చూసుకుంటున్న ఆ ప్రొఫెసర్ తరచు అర్థరాత్రి ఫోన్ చేసి వేధించేవాడని, కాల్ డిస్‌కనెక్ట్ చేసినా పదేపదే ఫోన్ చేసేవాడని ఆమె ఫిర్యాదు చేసింది.

ఒక రోజు అర్ధరాత్రి తనకు బర్త్‌డే విషెస్ చెబుతూ మెసేజ్ పంపించాడని, ఆ తర్వాత ఫోన్ చేసి తన భార్య ఇంట్లో లేదని, వంట చేయడానికి నువ్వు రావాలని పిలిచాడని ఆ బాలిక తెలియచేసింది. ఇందుకు సాక్షంగా ఆమె యూనివర్సిటీ కమిటీకి సెల్‌ఫోన్ మెసేజ్‌లు చూపించినప్పటికీ ఆ ప్రొఫెసర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే అక్టోబర్‌లోనే ఆ ప్రొఫెసర్‌ను వార్డన్ బాధ్యతల నుంచి తప్పించినట్లు యూనివర్సిటీ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఈ విషయం తన దృష్టికి రావడంతో రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్సలర్ అయిన గవర్నర్ బేబీ రాణి మౌర్య స్పందించారు. ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

 

Pant University Warden calls girl student at night
Pant University Warden calls girl student at midnight, A professors asked the girl student come home and cook as his wife is away

The post అర్ధరాత్రి విద్యార్థినిని ఇంటికి రమ్మన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: