రోడ్డుపై కాలు జారిపడి గాంధీజీ మరణించారా?

  భువనేశ్వర్: నాథూరాం గాడ్సే జరిపిన కాల్పులకు మహాత్మా గాంధీ మరణించినట్లు ఇప్పటి దాకా మనం చదువుకున్నాం. అయితే బాపూజీ మరణానికి ఇది కారణం కాదు..1948 జనవరి 30న రోడ్డుపైన కాలు జారిపడి మహాత్మా గాంధీ మరణించారని ఒడిశా రాష్ట్ర పాఠశాల, సార్వజనిక విద్యా శాఖ రూపొందించిన రెండు పేజీల బుక్‌లెట్ తెలియచేస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాలు, మేధావి వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఒడిశా ప్రభుత్వం ఈ బుక్‌లెట్ ప్రచురణ, పంపిణీకి దారితీసిన పరిస్థితులపై […] The post రోడ్డుపై కాలు జారిపడి గాంధీజీ మరణించారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భువనేశ్వర్: నాథూరాం గాడ్సే జరిపిన కాల్పులకు మహాత్మా గాంధీ మరణించినట్లు ఇప్పటి దాకా మనం చదువుకున్నాం. అయితే బాపూజీ మరణానికి ఇది కారణం కాదు..1948 జనవరి 30న రోడ్డుపైన కాలు జారిపడి మహాత్మా గాంధీ మరణించారని ఒడిశా రాష్ట్ర పాఠశాల, సార్వజనిక విద్యా శాఖ రూపొందించిన రెండు పేజీల బుక్‌లెట్ తెలియచేస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాలు, మేధావి వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఒడిశా ప్రభుత్వం ఈ బుక్‌లెట్ ప్రచురణ, పంపిణీకి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తునకు ఆదేశాలు జారీచేసింది. ఆమ బాపూజీ: ఏక ఝలక(మన బాపూజీ: ఒక సంగ్రహావలోకనం) పేరిట పాఠశాల విద్యా శాఖ ప్రచురించిన ఈ వివాదాస్పద బుక్‌లెట్‌పై దర్యాప్తునకు ఆదేశించినట్లు సంబంధిత మంత్రి సమీర్ రంజన్ దాస్ శుక్రవారం వెల్లడించారు.

ఈ బుక్‌లెట్ ప్రచురణకు బాధ్యులెవరైనప్పటికీ వారిని వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ప్రమాదంలో బాపూజీ మరణించారని చెప్పడానికి బదులుగా ఆయన ఎలా మరణించారో సవివరంగా రాసి ఉండాల్సిందని మంత్రి అన్నారు. ఆ బుక్‌లెట్‌ను తక్షణమే ఉపసంహరిస్తామని ఆయన తెలిపారు. కాగా, ఈ బుక్‌లెట్ ద్వారా సత్యాన్ని మరుగునపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోందని బార్‌గఢ్‌లోని గాంధీ స్మారక గ్రంథాలయం కార్యదర్శి మనోరంజన్ సాహు అభిప్రాయపడ్డారు. ప్రమాదం అంటే ఏమనుకోవాలి..గాంధీజీ రోడ్డుపైన కాలుజారి పడి మరణించారా… నాథూరాం గాడ్సే జరిపిన కాల్పులలో గాంధీజీ మరణించారన్న సత్యం అందరికీ తెలుసు..అని ఆయన అన్నారు. ఒడిశాలో విద్యావిధానం ఎలా కాషాయీకరణ, కార్పొరేటీకరణగా మారుతోందో ఈ బుక్‌లెట్ చెబుతోందని సోషలిస్టు పత్రిక సమదృష్టి సంపాదకుడు సుధీర్ పట్నాయక్ వ్యాఖ్యానించారు.

 

Gandhi dies due to trip on road, Odisha school education department published a two page booklet which contains controversial remarks

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డుపై కాలు జారిపడి గాంధీజీ మరణించారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: