అక్బర్ గ్యాంగ్ అకృత్యాలు…భర్త ముందే భార్యపై రేప్

    గాంధీనగర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రాంతంలో ఒంటరి జంటలపై అత్యాచారం చేయడమేకాకంపడా వారి వద్ద ఉన్న సొమ్మును దోచుకున్న అక్బర్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్బర్ అలియాస్ లాలూ సంధీ అనే గ్యాంగ్ ఒంటరిగా జంటలపై అఘాయిత్యాలకు పాల్పడేది. నర్మద నది తీరం వెంబడి ఒంటరిగా ఉన్న ఓ ప్రేమ జంటను అక్బర్ గ్యాంగ్ గమనించి వారిని కత్తితో బెదిరించారు. అనంతరం యువకుడిని తాళ్లతో కట్టేసి యువతిపై […] The post అక్బర్ గ్యాంగ్ అకృత్యాలు… భర్త ముందే భార్యపై రేప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

గాంధీనగర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రాంతంలో ఒంటరి జంటలపై అత్యాచారం చేయడమేకాకంపడా వారి వద్ద ఉన్న సొమ్మును దోచుకున్న అక్బర్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్బర్ అలియాస్ లాలూ సంధీ అనే గ్యాంగ్ ఒంటరిగా జంటలపై అఘాయిత్యాలకు పాల్పడేది. నర్మద నది తీరం వెంబడి ఒంటరిగా ఉన్న ఓ ప్రేమ జంటను అక్బర్ గ్యాంగ్ గమనించి వారిని కత్తితో బెదిరించారు. అనంతరం యువకుడిని తాళ్లతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసి వారి వద్ద ఉన్న సొమ్మును ఎత్తుకెళ్లారు. ఓ రైతు తన భార్యతో కలిసి తన పొలంలో ఉన్న గుడిసెలో నిద్రిస్తుండగా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అక్బర్ గ్యాంగ్ వారిని కత్తితో బెదిరించారు. అనంతరం రైతును పెద్ద తువ్వాలతో కట్టేసి అతడి ముందే ఆయన భార్యపై అత్యాచారం చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి అక్బర్ గ్యాంగ్‌ను పట్టుకున్నామని క్రైమ్ బ్రాంచ్ డిసిపి రాజ్‌దీప్ సిన్హా ఝాలా తెలిపారు. అక్బర్ గ్యాంగ్ గుజరాత్‌లో సనంద్, సర్ఖేజీ, బవ్లా, కలోల్, లాంఘదాజ్, బగోదర, మెహ్సనా, లఖ్తార్, బవ్లా, బటోడా, విరమ్‌గమ్, కొడి పోలీస్ స్టేషన్‌లో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

 

Akbar Gang Raped on Women front her Partners

The post అక్బర్ గ్యాంగ్ అకృత్యాలు… భర్త ముందే భార్యపై రేప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: