శబరిమలపై పునర్విచారణ!

     శబరిమల అయ్యప్ప గుడిలోకి రుతుస్రావ (1050 ఏళ్లు) వయసులోని మహిళలను అనుమతించిన తీర్పుపై అప్పీళ్లను మరింత విస్తృత ధరాసనానికి నివేదిస్తూ సుప్రీంకోర్టు గురువారం నాడు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన ఈ అంశంపై గరిష్ఠ స్థాయి న్యాయ పరిశీలనకు అవకాశం కలిగించడంగానే భావించాలి. ఏ అంశంపైనైనా మరింత లోతైన మథనం వల్ల సర్వోత్తమమైన నిర్ణయం వెలువడానికి దారి ఏర్పడాలి. అయితే అప్పటికే అత్యంత ప్రజాస్వామిక తీర్పు లభించిన కేసులో మరింత విస్తృత ధర్మాసనం విచారణ వల్ల […] The post శబరిమలపై పునర్విచారణ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

     శబరిమల అయ్యప్ప గుడిలోకి రుతుస్రావ (1050 ఏళ్లు) వయసులోని మహిళలను అనుమతించిన తీర్పుపై అప్పీళ్లను మరింత విస్తృత ధరాసనానికి నివేదిస్తూ సుప్రీంకోర్టు గురువారం నాడు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన ఈ అంశంపై గరిష్ఠ స్థాయి న్యాయ పరిశీలనకు అవకాశం కలిగించడంగానే భావించాలి. ఏ అంశంపైనైనా మరింత లోతైన మథనం వల్ల సర్వోత్తమమైన నిర్ణయం వెలువడానికి దారి ఏర్పడాలి. అయితే అప్పటికే అత్యంత ప్రజాస్వామిక తీర్పు లభించిన కేసులో మరింత విస్తృత ధర్మాసనం విచారణ వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమి ఉంటుందనే ప్రశ్న ఇటువంటప్పడు తలెత్తుతుంది. త్వరలో పదవీ విరమణ చేయనున్న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శబరిమల రెవ్యూ పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తుల పెద్ద పీఠానికి నివేదించిందిగాని ఆ బెంచ్‌ని ఏర్పాటు చేసే బాధ్యతను కొత్త సిజెఐకి విడిచిపెట్టింది.

శబరిమలలోకి మహిళల ప్రవేశం, మసీదుల్లోనూ వారికి అనుమతి ప్రసాదించే అంశం, దావూదీబొహ్రా తెగలో స్త్రీల జననాంగాలను కత్తిరించే ఆచార వివాదం ఈ మూడు మత సంబంధమైన కేసుల్లో కొత్తగా నెలకొనే విస్తృత ధర్మాసనం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. శబరిమల విషయంలో భారత రాజ్యాంగం హామీ ఇస్తున్న సమానత్వ హక్కు వెలుగులో ఇదివరకే వెలువడిన తీర్పును కొత్త ధర్మాసనం తల్లకిందులు చేయగలదేమోననే భయానికి చోటు కలుగుతున్నది. అక్కడ మహిళలపై 500 సంవత్సరాలుగా అమలవుతూ వచ్చిన నిషేధం రాజ్యాంగ విరుద్ధమైనదని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం గత ఏడాది సెప్టెంబర్ 18న 41 మెజారిటీ తీర్పు ఇచ్చింది. నలుగురు న్యాయమూర్తులు నిషేధాన్ని రద్దు చేయగా ఒకే ఒక్క మహిళా న్యాయమూర్తి అందుకు విరుద్ధంగా తీర్పు చెప్పారు. మహిళలపై నిషేధం మతపరమైన, ఆచార పరమైన నియమం కాగా రాజ్యాంగం (ఆర్టికల్స్ 14, 25) హామీ ఇస్తున్న సమానత్వ సూత్రం అటువంటి వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

మతం, జాతి, కులం, లింగం, జన్మస్థానం ప్రాతిపదికగా ఎవరి పట్లనైనా వివక్ష చూపడాన్ని రాజ్యాంగం 14వ అధికరణ అనుమతించదు. చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఒక్కరినీ తక్కువగా, అనర్హులుగా పరిగణించరాదని స్పష్టం చేస్తున్నది. అలాగే 25వ అధికరణ దేశంలోని పౌరులందరికీ శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి భంగం వాటిల్లని రీతిలో సమానమైన మత, ఆరాధన స్వేచ్ఛలను ప్రసాదిస్తున్నది. అందుచేత శబరిమల విషయంలో చిరకాలంగా అమలవుతూ వచ్చిన స్త్రీలకు అనుమతి నిరాకరణ ఆచారానికి రాజ్యాంగ ధర్మానికి స్పష్టమైన వైరుధ్యమున్నది. జాతి జన జీవనాన్ని నడిపించే దిక్సూచిగా స్వతంత్ర భారతావని ప్రజలు ఆవిష్కరించుకున్న సెక్యులర్ రాజ్యాంగ ధర్మమా, మహిళలను ఆలయానికి దూరంగా ఉంచుతున్న వివక్షాయుతమైన ఆచారమా? ఏది నిలబడాలి, మరేది తప్పుకోవాలి అనే మీమాంసను రాజ్యాంగ విహిత జనహిత దృష్టితో పరిశీలించి అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో గల ధర్మాసనం ఆ నిషేధాన్ని రద్దు చేసింది.

దానితో తీవ్ర అసంతృప్తికి, అసహనానికి, ఆగ్రహానికి లోనైన ఛాందస వాదులు ఆ తీర్పు అమలుకు నోచుకోకుండా బలంగా అడ్డుకోడానికి శబరిమలలో చేపట్టిన అవరోధాత్మకమైన ఆందోళన ఎటువంటి విపరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. కేరళలోని వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం మొదట్లో కొంత తటపటాయించినా, అనంతరం తీర్పు అమలుకు నోచుకునేలా చేయడానికి దోహదపడే వైఖరిని పాక్షికంగానైనా ప్రదర్శించింది. తీర్పు ఆసరాతో ఆలయ ప్రవేశానికి ప్రయత్నించిన ప్రగతి శీల మహిళలకు కొంతైనా రక్షణ లభించింది. మరి కొంత మంది సాహస మహిళలు అవమానాలను ఎదుర్కోవలసి వచ్చింది.

ఆలయ సంప్రదాయ, ఆచార పరిరక్షణ పేరుతో జనాభాలో సగమైన మహిళా లోకానికి శబరిమలలో ప్రవేశం మళ్లీ బందైతే అది చెప్పనలవి కాని తిరోగమనమే, అత్యంత దురదృష్టకరమైన పరిణామమే కాగలదు. పురుషులతో సమానంగా స్త్రీలు సర్వ స్వేచ్ఛలు, గౌరవాలు, ఔన్నత్యాలు పొందగలుగుతున్న ఆధునిక ప్రపంచంలో గత తీర్పుతో రద్దయిపోయిన ఆలయ ప్రవేశ నిషేధాన్ని మళ్లీ విధించుకుని లింగపరమైన వివక్షనే ఎంచుకున్నామనే అపఖ్యాతిని మూటగట్టుకోవలసి వస్తుంది. అయితే శబరిమలలో మహిళలకు సుప్రీంకోర్టు ఇంతకు ముందు ప్రసాదించిన అనుమతిపై గొగోయ్ ధర్మాసనం ఇప్పుడు స్టే విధించకపోడమే హర్షించదగిన పరిణామం. ఈ నెల 16 నుంచి శబరిమల యాత్ర తిరిగి మొదలవుతున్న పరిస్థితుల్లో ఆమేరకు ఇది మేలు మలుపే.

SC Refers Sabarimala Review Petitions to 7 Judge Bench

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శబరిమలపై పునర్విచారణ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: