డీల్ ఓకే

రాఫెల్ తీర్పుపై రెవ్యూ పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీం, పిటిషనర్ల ఆరోపణ అవాస్తవం, సిబిఐ విచారణ అవసరం లేదు న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి ఊరట లభించింది. రాఫెల్‌పై దాఖలైన సమీక్ష పిటిషన్లన్నిటినీ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాఫెల్‌పై గతం లో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్‌నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం […] The post డీల్ ఓకే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
రాఫెల్ తీర్పుపై రెవ్యూ పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీం, పిటిషనర్ల ఆరోపణ అవాస్తవం, సిబిఐ విచారణ అవసరం లేదు

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి ఊరట లభించింది. రాఫెల్‌పై దాఖలైన సమీక్ష పిటిషన్లన్నిటినీ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాఫెల్‌పై గతం లో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్‌నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2018 డిసెంబర్ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ కేంద్రానికి క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును పునస్సమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలతో పాటుగా సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు పిటిషన్లు దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోనిత్రిసభ్య రాజ్యాంగ ధర్మాసనం గురువారం  తాజాగా వీటిపై తీర్పును వెలవరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్రం వాస్తవాలు దాచిపెట్టి సుప్రీంకోర్టును పక్కదోవ పట్టించిందన్న పిటిషనర్ల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ధరామసనం స్పష్ట చేసింది. రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అంతేకా దు, గత ప్రభుత్వాల హయాంనుంచి కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అంశాన్ని తాము పరిశీలిస్తున్నామనే అంశాన్ని తాము మరిచిపోలేదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

నిర్ణయం తీసుకునే ప్రక్రియ, ధర నిర్ణయం, ఆఫ్‌సెట్ ధర ఈ మూడు అంశాలు మినహా మిగతా అంశాలను పరిశీలించాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. భారతీయ రాజకీయాలను ఇటీవలి కాలంలో అత్యంత ప్రభావిత చేసిన అంశాల్లో రాఫెల్ ఒకటి. వాయుసేన బలోపేతంలో భాగంగా ఫ్రాన్స్‌నుంచి ఈ యుద్ధ విమానాలకొనుగోలుకు చేసుకున్న ఒప్పందం తీవ్ర వివాదాస్పదమైంది. మొత్తం వివాదం సర్వోన్నత న్యాయస్థానానికి చేరగా, ఒప్పందంలో ఎలాంటి లోపాల్లేవంటూ గతంలో కోర్టు తేల్చింది. అయితే ఈ తీర్పును తిరిగి సమీక్షించాలంటూ దాఖలైన అనేక పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గత మే 10న రిజర్వ్‌లో ఉంచింది. గురువారం తన తీర్పును వెలువరించింది.

Rafale deal verdict

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డీల్ ఓకే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: