అవకాశాలు అపరిమితం

భారత్ పెట్టుబడులకు ఎంతో అనుకూలం ఎన్నో సంస్కరణలు చేపట్టాం బ్రిక్స్ ఫోరంలో వ్యాపారవేత్తలతో మోడీ బ్రసాలియా: భారత్ ప్రపంచంలోనే అత్యంత అనుకూల, పెట్టుబడులకు స్నేహపూర్వక ఆర్థిక వ్యవస్థ అని బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, అపరిమితి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించింది. గురువారం ఇక్కడ బ్రిక్స్ వ్యాపార నాయకులతో జరిగిన సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ, అంతర్జాతీయంగా మందగమనంలో ఐదు దేశాల బృందం ఆర్థిక వృద్ధి చూపుతోందని అన్నారు. ‘రాజకీయంగా స్థిరత్వం కల్గి […] The post అవకాశాలు అపరిమితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భారత్ పెట్టుబడులకు ఎంతో అనుకూలం
ఎన్నో సంస్కరణలు చేపట్టాం
బ్రిక్స్ ఫోరంలో వ్యాపారవేత్తలతో మోడీ

బ్రసాలియా: భారత్ ప్రపంచంలోనే అత్యంత అనుకూల, పెట్టుబడులకు స్నేహపూర్వక ఆర్థిక వ్యవస్థ అని బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, అపరిమితి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించింది. గురువారం ఇక్కడ బ్రిక్స్ వ్యాపార నాయకులతో జరిగిన సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ, అంతర్జాతీయంగా మందగమనంలో ఐదు దేశాల బృందం ఆర్థిక వృద్ధి చూపుతోందని అన్నారు.

‘రాజకీయంగా స్థిరత్వం కల్గి ఉండడం వల్ల భారత్ ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూల ఆర్థిక వ్యవస్థ. ఎన్నో అనుకూల సంస్కరణలు చేపడుతోంది. 2024 నాటికి భారత్ 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావాలని ఆశిస్తోంది’ అని మోడీ వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తలకు భారత్‌లో అపరిమిత అవకాశాలు ఉన్నాయని, తద్వారా వారు వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని కోరారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో బ్రిక్స్ దేశాల వాటా 50 శాతం ఉందని మోడీ అన్నారు. ప్రపంచంలో మాంద్యం ఉన్నప్పటికీ బ్రిక్స్ దేశాలు ఆర్థికంగా వృద్ది బాటలో పయనిస్తున్నాయని అన్నారు.

పన్ను రేటును 15 శాతానికి తగ్గించాం

అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోడీ బ్రిక్స్ దేశాలను (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సామాజిక భద్రతా ఒప్పందంపై చర్చించాలని కోరారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 50 శాతం బ్రిక్స్ దేశాలు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. ప్రపంచ మాంద్యం ఉన్నప్పటికీ బ్రిక్స్ దేశాలు ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయని అన్నారు. భారత్‌లో పెట్టుబడుల కోసం పలు సంస్కరణలు చేపట్టామని, కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు తయారీ కంపెనీ పన్ను రేటును 15 శాతానికి తగ్గించినట్టు చెప్పారు. ఇటీవల కార్పొరేట్ తగ్గించడం ద్వారా కంపెనీలకు ప్రోత్సాహం అందించామన్నారు. పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా 4 అతిపెద్ద బ్యాంకులను సృష్టించామని మోడీ వివరించారు.

కాగా బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పలు దేశాధినేతలతో చర్చలు జరిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. బ్రెజిల్‌లోని భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పించే నిర్ణయానికి గాను అధ్యక్షుడు బోల్సోనారోకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో 2020 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా భారతదేశానికి రావాలని ప్రధాని ఆహ్వానించారు. దీనికి బోల్సోనారో అంగీకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, బ్రెజిల్ అధ్యక్షుడు భారతదేశానికి వ్యాపార ప్రతినిధి బృందంతో పాటు వస్తారు. వారు ఇక్కడ అంతరిక్ష, రక్షణ రంగంలో సహకారంపై ఒప్పందం కుదుర్చుకోవచ్చు.

Modi woos BRICS business leaders

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అవకాశాలు అపరిమితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: