సింధు, కశ్యప్ ఔట్

హాంకాంగ్: భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్‌లు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో తెలుగు తేజం కశ్యప్ ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఛాంపియన్ సింధు పరాజయం చవిచూసింది. రెండో రౌండ్‌లో థాయిలాండ్ షట్లర్ బుసనన్ చేతిలో కంగుతింది. హోరాహోరీగా సాగిన సమరంలో థాయిలాండ్ క్రీడాకారిణి బుసనన్ చేతిలో ఓటమి పాలైంది. మూడు సెట్ల సమరంలో సింధు 18-21, 21-11, […] The post సింధు, కశ్యప్ ఔట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హాంకాంగ్: భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్‌లు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో తెలుగు తేజం కశ్యప్ ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఛాంపియన్ సింధు పరాజయం చవిచూసింది. రెండో రౌండ్‌లో థాయిలాండ్ షట్లర్ బుసనన్ చేతిలో కంగుతింది. హోరాహోరీగా సాగిన సమరంలో థాయిలాండ్ క్రీడాకారిణి బుసనన్ చేతిలో ఓటమి పాలైంది. మూడు సెట్ల సమరంలో సింధు 18-21, 21-11, 16-21తో ఓటమి మూట గట్టుకుంది.

ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. తొలి గేమ్‌లో బుసనన్ జోరును కొనసాగించింది. చివరి వరకు దూకుడును ప్రదర్శిస్తూ సెట్‌ను దక్కించుకుంది. కానీ, రెండో సెట్‌లో భారత స్టార్ సింధు పుంజుకుంది. తన మార్క్ షాట్లతో అలరించిన సింధు లక్షం దిశగా అడుగులు వేసింది. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం సింధు మళ్లీ ఒత్తిడికి గురైంది. ప్రత్యర్థి ధాటికి ఎదురు నిలువలేక పోయింది. చెలరేగి ఆడిన బుసనన్ అలవోకగా సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక, పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ రెండో రౌండ్‌లోనే ఇందటిదారి పట్టాడు. చైనీస్‌తైపీ షట్లర్ టిన్ చెన్‌తో జరిగిన పోరులో ఓటమి పాలయ్యాడు. చెన్ 23-21, 21-10తో కశ్యప్‌పై విజయం సాధించి ముందంజ వేశాడు.

PV Sindhu Kashyap Crash Out in Second Round

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సింధు, కశ్యప్ ఔట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: