జెపిసి దర్యాప్తు జరిపించాల్సిందే

  రాఫెల్ తీర్పుపై రాహుల్ డిమాండ్ న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ భారీ తలుపులు తెరిచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటూ, ఈ వ్యవహారంపై కేంద్రం నిజాయితీగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై తాము గతంలో కోరినట్లుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకోసం […] The post జెపిసి దర్యాప్తు జరిపించాల్సిందే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాఫెల్ తీర్పుపై రాహుల్ డిమాండ్

న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ భారీ తలుపులు తెరిచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటూ, ఈ వ్యవహారంపై కేంద్రం నిజాయితీగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై తాము గతంలో కోరినట్లుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకోసం కదుర్చుకున్న ఒప్పందానికి క్లీన్‌చిట్ ఇస్తూ గత ఏడాది డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం రాహుల్ ఈ డిమాండ్ ఈ రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, కెఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడినట్లు ధర్మాసనం తరఫున తీర్పును చదివి వినిపించిన జప్టిస్ కౌల్ పేర్కొన్నారు. కాగా వేరుగా తీర్పు ఇచ్చిన జస్టిస్ కొన్ని విషయాలు మిన హా జోసెఫ్ జస్టిస్ కౌల్ రాసిన ప్రధాన తీర్పుతో అంగీకరిస్తుప్పట్లు పేర్కొన్నా రు, ఇందుకు తాను కారణాలను తెలియజేసినట్లు కూడా ఆయన పేర్కొన్నా రు. ‘రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తుకు జస్టిస్ జోసెఫ్ భారీగా తలుపులు తెరిచారు. పూర్తి నిజాయితీతో ఇప్పుడు దర్యాప్తు ప్రాంభం కావాలి. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరపడానికి జెపిసిని కూడా ఏర్పాటు చేయాలి’ అని రాహుల్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన దానికి ‘బిజెపి లైస్ ఆన్ రాఫెల్’అనే హాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. కాగా బిజెపి వేడుకలు జరుపుకోవడం ఆపి రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తుకు కోర్టు తీర్పు మార్గాన్ని సుగమం చేసినందున దర్యాప్తు జరిపించడంపై దృష్టిపెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీస్ సుర్జేవాలా కూడా విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు.

SC rejects petition against clean chit to Modi govt

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జెపిసి దర్యాప్తు జరిపించాల్సిందే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: