లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు

హైదరాబాద్ : లోకో పైలట్ చంద్ర శేఖర్ కుడికాలికి కేర్ హాస్పిటల్ వైద్యులు గురువారం నాడు సర్జరీ చేసి కుడికాలు మోకాలు పైభాగం వరకు తొలగించారు. కాగా సర్జరీ చేసే ముందు చంద్రశేఖర్ కుటుంబసభ్యులకు వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా చంద్రశేఖర్ తండ్రి జోసఫ్ మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం తన కొడుకు చంద్రశేఖర్ కుడికాలుకు సర్జరీ చేసి మోకాలు పైభాగం వరకు తొలగించారన్నారు. కుడి కాలు పై భాగం వరకు స్పర్శ లేనందున, కుడి […] The post లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : లోకో పైలట్ చంద్ర శేఖర్ కుడికాలికి కేర్ హాస్పిటల్ వైద్యులు గురువారం నాడు సర్జరీ చేసి కుడికాలు మోకాలు పైభాగం వరకు తొలగించారు. కాగా సర్జరీ చేసే ముందు చంద్రశేఖర్ కుటుంబసభ్యులకు వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా చంద్రశేఖర్ తండ్రి జోసఫ్ మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం తన కొడుకు చంద్రశేఖర్ కుడికాలుకు సర్జరీ చేసి మోకాలు పైభాగం వరకు తొలగించారన్నారు. కుడి కాలు పై భాగం వరకు స్పర్శ లేనందున, కుడి కాలు రక్త ప్రసరణ నిలిచి పోయిందన్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స పట్ల తామంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు.చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి నెమ్మదిగా కుదుట పడుతుందని, పల్స్ రేటు శాతం కూడా మెరుగ్గానే ఉందని జోషఫ్ చెప్పారు. బ్లడ్ సెల్స్ కౌంట్ విషయంలోనూ పరిస్థితి మెరుగ్గా వుందన్నారు.

తన కొడుకు స్పృహలోకి వచ్చాడని, అందరినీ గుర్తు పదుతున్నాడని అన్నారు. ఆరు వారాల తర్వాత మరొక సర్జరీ చేస్తామని వైద్యులు తెలిపారని, శరీర భాగంలో మల్టిపుల్ గాయాలయ్యాయని చెప్పారన్నారు. ఆరోగ్యం మెరుగైన తరువాత వైద్యులు ఆ ప్రాంతాల్లో సర్జరీ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.. తన కొడుకు బతకాలనీ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జోషఫ్ మీడియా తెలిపారు. కాగా కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో గాయపడిన ఎంఎంటిఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ కు కుడికాలుకు తీవ్రంగా గాయాలు కావడంతో తొలగించాల్సి వచ్చిందని కేర్‌ఆస్పత్రి వైద్యులు వివరించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, గురువారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద సోమవారం ఉదయం లింగంపల్లి-ఫలక్ నుమా ఎంఎంటిఎస్ కర్నూల్ – సికింద్రాబాద్ ఇంటర్ సిటీ(హంద్రీ) ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టిన ఘటనలో 18 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. క్యాబిన్ లో ఇరుక్కున్న లోకోపైలట్ చంద్రశేఖర్ ను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అతి కష్టం మీద బయటకు తీశాయి.అనంతరం లోకోడ్రైవర్ చంద్రశేఖర్‌ను వైద్య సేవలం నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే.

Loco pilot Chandrasekhar right leg Removed

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: