ద.మ. రైల్వేలో రూట్‌ల విద్యుదీకరణ

  800 స్టేషన్‌లల్లో ఎల్‌ఇడీ దీపాలు : మంజుగుప్తా హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 2023 నాటికి విద్యుదీకరణ చేయడం జరుగుతుందని భారతీయ రైల్వే బోర్డు మెంబర్ మంజు గుప్తా పేర్కొన్నారు. బుధవారం రైల్ నిలయం ఆడిటోరియంలో నేషనల్ గ్రీన్ రైల్ సెమినార్ పేరిట రైల్వే అధికారుల మూడు రోజుల శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 60శాతం రూట్ కిమీల […] The post ద.మ. రైల్వేలో రూట్‌ల విద్యుదీకరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

800 స్టేషన్‌లల్లో ఎల్‌ఇడీ దీపాలు : మంజుగుప్తా

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 2023 నాటికి విద్యుదీకరణ చేయడం జరుగుతుందని భారతీయ రైల్వే బోర్డు మెంబర్ మంజు గుప్తా పేర్కొన్నారు. బుధవారం రైల్ నిలయం ఆడిటోరియంలో నేషనల్ గ్రీన్ రైల్ సెమినార్ పేరిట రైల్వే అధికారుల మూడు రోజుల శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 60శాతం రూట్ కిమీల పొడవైన రైలు మార్గం విద్యుదీకరణ చేయడం జరిగిందన్నారు. భారతదేశంలోని 800 రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ స్థాయి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పర్యావరణ హితమైన దక్షిణ మధ్య రైల్వే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జిఎం బిబిసింగ్ మాట్లాడుతూ భారతీయ రైల్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం 15000 చకిమీటర్ల స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తామని వివరించారు. రైల్ నిలయం ఆడిటోరియంలో ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించే నేషనల్ గ్రీన్ రైల్ సెమినార్ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ పాత బావుల పునరుద్దరణ తో పాటు రైల్వే పచ్చదనం కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ సెమినార్‌లో ముఖ్య ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫడ్కే, హైదరాబాద్ ఛాప్టర్ ఐబిబిసి చైర్మన్ శేఖర్‌రెడ్డి, సిఐఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటగిరి పాల్గొన్నారు.

Electrification of Routes in south central railway

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ద.మ. రైల్వేలో రూట్‌ల విద్యుదీకరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: