రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి: సిపి అంజనీకుమార్

  హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ… నగరంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏడాదిన్నర నుంచి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నగరంలో వాహనదారులకు మరింత భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలను ఘననీయంగా […] The post రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి: సిపి అంజనీకుమార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ… నగరంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏడాదిన్నర నుంచి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నగరంలో వాహనదారులకు మరింత భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.

రోడ్డు ప్రమాదాలను ఘననీయంగా తగ్గించారని,గతంలో కంటే 10శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గించారని తెలిపారు. వాహనదారులు సంతోషంగా ప్రయాణించేందుకు ట్రాఫిక్ పోలీసులు కృషి చేస్తున్నారని అన్నారు. నగర ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రత కార్యక్రమాన్ని జూలై, 2019న ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మొదట్లో పివిఆర్ సినిమాస్ సహకరించి అవార్డులు అందజేసిందని, ఇప్పుడు మెక్ డొనాల్డ్ కంపెనీ ఇస్తోందని తెలిపారు. గత 25 ఏళ్ల నుంచి నగరంలో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు ఒక్కసారి కూడా ఉల్లంఘించని వారికి అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు.

అవార్డులు స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చిన మెక్‌డొనాల్డ్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులకు ప్రతి నెల 300 కూపన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్, ట్రాఫిక్ డిసిపిలు ఎల్‌ఎస్ చౌహాన్, బాబు రావు, మెక్‌డొనాల్డ్ ఆపరేషన్స్ మేనేజర్ రితేష్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ వికే అభిలాష్ పాల్గొన్నారు.

CP said measures would be taken to ensure road safety

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి: సిపి అంజనీకుమార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: