అన్నీ అనుమానాలే…

హంద్రీ, ఎంఎంటిఎస్ రైళ్ల ప్రమాదంలో సిగ్నల్ ఇచ్చి ఫూట్‌బ్యాక్ చేశారా? హంద్రీనీవా రైలుకు సిగ్నల్ అప్పటికే ఇచ్చారా? వాకీటాకీలో తెలిపినా… లోకోపైలట్ ముందుకు వచ్చారా? లోకో పైలట్‌లు, రైల్వే అధికారుల భిన్నాభిప్రాయాలు మన తెలంగాణ/ సిటిబ్యూరో : కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకున్న హంద్రీనీవా, ఎంఎంటిఎస్ రైళ్ల్లు ఢీకొట్టిన ప్రమాదంపై అన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిగ్నల్ ఇస్తేనే ఎంఎంటిఎస్ ముందుకు పరుగులు తీసిందని కొందరు, లేదు సిగ్నల్ ఇవ్వకుండానే లోకో పైలట్ నిర్లక్ష్యంగా ముందుకు వచ్చారని […] The post అన్నీ అనుమానాలే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హంద్రీ, ఎంఎంటిఎస్ రైళ్ల ప్రమాదంలో

సిగ్నల్ ఇచ్చి ఫూట్‌బ్యాక్ చేశారా?
హంద్రీనీవా రైలుకు సిగ్నల్ అప్పటికే ఇచ్చారా?
వాకీటాకీలో తెలిపినా… లోకోపైలట్ ముందుకు వచ్చారా?
లోకో పైలట్‌లు, రైల్వే అధికారుల భిన్నాభిప్రాయాలు

మన తెలంగాణ/ సిటిబ్యూరో : కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకున్న హంద్రీనీవా, ఎంఎంటిఎస్ రైళ్ల్లు ఢీకొట్టిన ప్రమాదంపై అన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిగ్నల్ ఇస్తేనే ఎంఎంటిఎస్ ముందుకు పరుగులు తీసిందని కొందరు, లేదు సిగ్నల్ ఇవ్వకుండానే లోకో పైలట్ నిర్లక్ష్యంగా ముందుకు వచ్చారని మరికొందరు రైల్వే సిబ్బంది, అధికారులు పరస్పర విరుద్ధంగా అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. అయితే, సాధారణంగా రైలు స్టేషన్‌కు వచ్చిన తర్వాత సిగ్నల్ ఇవ్వనిదే ముందుకు కదలదని పలువురు సీనియర్ రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.అలా నిర్లక్షంగా రైలును సిగ్నల్ లేకుండా ముందుకు తీసుకెళితే ఏకంగా సర్వీసు నుంచి అతడిని రిమూవల్ సర్వీస్ చేస్తారని సీనియర్ అధికారులు వివరిస్తున్నారు.

ఎంఎంటిఎస్ కాచిగూడ స్టేషన్‌కు వచ్చినప్పుడే సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ముందుకు కదిలినట్లు కొందరు అక్కడి ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. లోకో పైలెట్‌కు సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఓ అధికారి వాకీటాకీలో సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పిన తర్వాతే రైలును ముందుకు తీసుకెళ్తారని వారు పేర్కొంటున్నారు. ముందుగా సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఓ అధికారి సిగ్నల్‌ను ఫూట్ బ్యాక్ చేసి, హంద్రీనీవా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చినట్లు కొందరు అధికారుల అభిప్రాయం. సిగ్నల్ పాయింట్‌సెట్ చేసిన తర్వాతే అధికారి సిగ్నల్ ఇస్తాడని, సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాకీటాకీలో లోకో పైలట్‌కు సమాచారమివ్వడం తప్పని సరి, అలా జరగని పక్షంలో రైలును డ్రైవర్ ముందుకు కదలనివ్వడని వారు వివరిస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలు, ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్న తర్వాత లోకో పైలట్ తప్పిదం ఎక్కడా కన్పించదని వారు సాంకేతిక వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సిగ్నల్ ఇచ్చే ముందు ఆ అధికారి ముందున్న స్విచ్ బోర్డుపై మొత్తం వివరాలుంటాయని, రైలు స్టేషన్‌కు వచ్చి ఆగితే రెడ్ సిగ్నల్ కన్పిస్తుంది. సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఆటోమేటిక్‌గా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఈ విషయం సిగ్నలింగ్ అధికారి స్విచ్ బోర్డు మీద స్పష్టంగా కన్పిస్తుందని క్రిందిస్థాయి అధికారులు వెల్లడిస్తున్నారు.

సిగ్నల్ ఫూట్ బ్యాక్ చేశారా..?

రైలుకు ఔటర్‌లో సిగ్నల్ ఇచ్చిన తర్వాత లోకోపైలట్ రైలును ముందుకు కదిలిస్తారు. ఎంఎంటిఎస్ ముందుకు వెళ్లిన తర్వాత అధికారి సిగ్నల్‌ను ఫూట్‌బ్యాక్ చేసినా కూడా లోకోపైలట్‌కు కనిపించదు, తెలియదు. అదే సమయంలో హంద్రీనీవా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు కూడా సిగ్నల్ ఇవ్వడంతో రెండు రైళ్లు ఎదురెదురుగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికశాతం రైల్వే సాంకేతికపరమైన విధులను నిర్వహించే వారు, డ్రైవర్లు వెల్లడిస్తున్నారు. రెండవ నంబర్ ప్లాట్ ఫారంపైకి వచ్చిన ఎంఎంటిఎస్ సిగ్నల్‌ను చూసుకుని ముందుకు వెళ్లింది. ఆ తర్వాత అదే పట్టాలపై నుంచి వస్తున్న హంద్రీనీవా రైలు రెండవ ప్లాట్‌ఫారం పైకి వచ్చే ట్రాక్ నుంచి మరలి నలుగో నంబర్ ప్లాట్ ఫారంపైకి వెళ్లే ట్రాక్‌లోకి వెళ్ళే క్రమంలో పట్టాలను క్రాస్ చేస్తున్న సమయంలోనే ఎంఎంటిఎస్ ఢీ కొట్టిన ప్రమాదం జరిగింది.

గార్డు సమాచారమే కీలకం

సిగ్నల్‌ను ఫూట్ బ్యాక్ చేసినది లేదా సిగ్నల్ లేకున్నా ముందుకు రైలు వెళ్ళిన విషయం గార్డుకు తప్పనిసరిగా తెలుస్తుంది. గార్డుకు తెలిసిన వెంటనే పైలట్‌కు చెప్పాల్సి ఉంటుంది. కానీ, అది చేశాడా లేదా తెలియాల్సి ఉంది.ఎంఎంటిఎస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత 20 సెకన్ల వ్యవధిలోనే అతి వేగాన్ని అందుకుంటుంది. అయితే, అప్పటికే ఎంఎంటిఎస్ సిగ్నల్ దాటడంతో తగిన చర్యలు తీసుకునే పరిస్థితి చేయిదాటిపోయిందా..? అనేది విచారణలో తెలియాల్సి ఉన్నది. లోకోపైలట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రమాదాన్ని పైలట్‌పైకి తోసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అనే అనుమానాలను రైల్వే డ్రైవర్లు, క్రిందిస్థాయి అధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. విచారణ ప్రారంభం కాకముందే పైలట్ తప్పిదం వల్లే రెండు రైళ్లు ఢీకొట్టాయని రైల్వే అధికారులు ప్రకటించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఎంఎంటిఎస్ 1 లేదా 3 నిమిషాలే ఆపాలి

ఎంఎంటిఎస్ రైలును సాధారణంగా రైల్వే స్టేషన్‌లో నిమిషం మాత్రమే ఆపాలి అని నియమాలున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. కొన్ని అనివార్య కారణాలు ఉత్పన్నమైతే మూడు నిమిషాల వరకు మాత్రమే నిలపాలి. అంతకుమించి నిలిపేందుకు నిబంధనలు వర్తించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎంఎంటిఎస్ చివరి స్టేషన్లు లింగంపల్లి, ఫలక్‌నూమా తదితర వాటిల్లో కూడా 5 నుంచి 6 నిమిషాలకు మించి నిలుపడానికి వీలులేదని వారు తెలిపారు. దీన్ని అనుసరించి సిగ్నల్ వ్యవస్థతోనే లోకో పైలట్ ముందుకు వెళ్తె తప్పిదం ఎలా జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.

Hyderabad train collision

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అన్నీ అనుమానాలే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: