ఆర్‌టిసికి పిఎఫ్ నోటీసు

  బకాయిలు 15 రోజుల్లో చెల్లించపోతే ప్రాసిక్యూషన్ చర్యలు హైదరాబాద్ : ఆర్‌టిసికి మరో షాక్.. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్‌టిసికి తాజాగా మంగళవారం రాష్ట్ర ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రాసిక్యూషన్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులో వివిధ అంశాలపై పక్షం రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా తెలిపింది. తెలంగాణ ఆర్‌టిసికి ఆర్‌టిసికి పిఎఫ్ నోటీసు రాష్ట్ర ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నోటీసు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రవాణా శాఖ […] The post ఆర్‌టిసికి పిఎఫ్ నోటీసు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బకాయిలు 15 రోజుల్లో చెల్లించపోతే ప్రాసిక్యూషన్ చర్యలు

హైదరాబాద్ : ఆర్‌టిసికి మరో షాక్.. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్‌టిసికి తాజాగా మంగళవారం రాష్ట్ర ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రాసిక్యూషన్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులో వివిధ అంశాలపై పక్షం రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా తెలిపింది. తెలంగాణ ఆర్‌టిసికి ఆర్‌టిసికి పిఎఫ్ నోటీసు రాష్ట్ర ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నోటీసు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రవాణా శాఖ విభజించిన తరువాత ఇంత వరకు ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి పిఎఫ్ కోడ్‌గానీ, కార్మికుల వాటాగానీ ఇప్పటి వరకు రాలేదని ఆ నోటీసులో హైదరాబాద్ రీజయన్ పిఎఫ్ కార్యాలయ కమిషనర్ పేర్కొన్నారు. నిధులు చెల్లింపులేకపోవడం, కోడ్ రాకపోవడం తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని తెలిపింది. ఇందుకు సంబంధించి 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ టిఆర్‌ఎస్‌ఆర్‌టిసిని పిఎఫ్ కమిషనర్ లేఖలో అడిగారు.

అయితే వార రోజుల క్రితం ఆర్‌టిసి అధికారులకు ప్రావిడెంట్ ఫండ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్‌టిసి కార్మికుల పిఎఫ్ ఖాతాలోఎప్పటికప్పుడు జమ కావాల్సిన సొమ్ము జమ కావడం లేదని. దీంతో, జమ చేయాల్సింది మొత్తం రూ.760.62 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఆర్‌టిసి ఇన్‌చార్జ్ ఎండి సునీల్‌శర్మకు పిఎఫ్ రీజనల్ కమిషనర్ పిఎఫ్ బకాయి వివరాలు తెలియజేస్తూ నోటీసులు పంపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 15లోపు పూర్తి సమాచారంతో తమ ముందు హాజరుకావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. ఆ లేఖతో పాటు తాజాగా పిఎఫ్ కమిషన్ పంపిన నోటీసుకు టిఎస్‌ఆర్‌టిసి వివరణ ఇవ్వాల్సివుంది. ఆర్‌టిసిని కష్టాలు వేధిస్తున్నాయి.

ఒకవైపు సమ్మె, మరోవైపు నష్టాలు వెరసి సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఆర్‌టిసిలో సగం 5100 రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధమయింది. ఇప్పటికే ఆర్‌టిసి మొత్తం బకాయిలు రూ.2209.66 కోట్లకు చేరుకుంది. ఇందులో పిఎఫ్ బకాయిలు రూ.788.30 కోట్లు, క్రెడిట్ కో-ఆరేటివ్ సొసైటీ బకాయిలు రూ.500.95 కోట్లు, మోటారు వెహికల్ యాక్టు ప్రకారం 2017 నుంచి 2019 వరకు రూ.452.36కోట్లు బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు సమ్మె 40 రోజులకు చేరడంతో రోజుకు రూ.కోటి చొప్పున ఇప్పటికే రూ.40 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిం ది. లాభాలు వచ్చే పండుగల సమయంలో ఆందోళనబాట పట్టడం మరింత నష్టాల ఊబిలోకి చేర్చింది.

PF notice to RTC

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్‌టిసికి పిఎఫ్ నోటీసు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.