సమ్మెపై న్యాయకమిటీ!

  ముగ్గురు విశ్రాంత సుప్రీం న్యాయమూర్తులతో వేస్తాం, ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకోండి : ఎజికి హైకోర్టు ఆదేశం చట్టానికి అతీతంగా నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టీకరణ, విచారణ నేటికి వాయిదా హైదరాబాద్ : ఆర్‌టిసి సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు ఉన్న అధికారాలు, పరిధులపై సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్ వాదనలు వినిపించారు. గతంలో ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు. ఇప్పుడు టిఎస్‌ఆర్‌టిసిపై కూడా ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని విద్యాసాగర్ కోరారు. […] The post సమ్మెపై న్యాయకమిటీ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముగ్గురు విశ్రాంత సుప్రీం న్యాయమూర్తులతో వేస్తాం, ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకోండి : ఎజికి హైకోర్టు ఆదేశం

చట్టానికి అతీతంగా నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టీకరణ, విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్ : ఆర్‌టిసి సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు ఉన్న అధికారాలు, పరిధులపై సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్ వాదనలు వినిపించారు. గతంలో ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు. ఇప్పుడు టిఎస్‌ఆర్‌టిసిపై కూడా ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని విద్యాసాగర్ కోరారు. ఎపిఎస్ ఆర్‌టిసి పై ప్ర యోగించిన ఎస్మా టిఎస్ ఆర్‌టిసిపై ఎలా వర్తిస్తుందని హైకోర్టు పేర్కొంది. ఆర్‌టిసి సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్ స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన జివొ లు ఇప్పుడు వర్తిస్తాయా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్‌టిసిని 1998, 20 15లో ఎస్మా కింద పేర్కొంటూ ప్రభు త్వం ఉత్తర్వులు ఇచ్చిందని సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్ తెలిపారు.

1998 ఇచ్చింది ఎపిఎస్‌ఆర్‌టిసికి వర్తిస్తుంది, టిఎస్‌ఆర్‌టిసికి కాదని హైకోర్టు తెలిపింది. 2015లో ఇచ్చిన ఉత్తర్వులు 6 నెలల వరకే వర్తిస్తాయని కోర్టు పేర్కొం ది. బస్సుల్లో అధిక ఛార్జీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది శశికిరణ్ పేర్కొన్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. అధిక ఛార్జీల కారణంగా సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. చట్టానికి అతీతంగా నిర్ణయాలు తీసుకోలేమని హైకోర్టు తెలిపింది. సమ్మె లీ గలా.. ఇల్లీగలా అనేది నిర్ణయించడం తమ పరిధిలో లేదని కోర్టు పేర్కొంది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇదివరలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు బుధవారం నాటి వరకు పొడిగించింది.ఈ క్రమంలో రూట్ల ప్రైవేటీకరణపై విచారణను (నేటికి) బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

సుప్రీంకోర్టు మాజీ
న్యాయమూర్తులతో కమిటీ
ఆర్‌టిసి సమ్మెపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం అడిగి బుధవారంలోగా చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. ఇందుకు బదులుగా కొంత మంది సమ్మె ఇల్లీగల్ అని ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. మరికొంత మంది ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. మరికొంత మంది చర్చలకు పిలిచేలా ఆదేశాలు ఇవ్వమంటున్నారు. అసలు ఈ అంశం కోర్టు పరిధిలో ఉందో, లేదో చెప్పట్లేదు. కోర్టు పరిధి దాటి మేము ఆదేశాలు ఇవ్వలేము’ అని న్యాయస్థానం పేర్కొంది. ఆర్‌టిసి యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని హైకోర్టు ప్రశ్నించింది.

చర్చలు జరపాలని ఏ ప్రాతిపదికన ఆదేశించగలమని కోర్టు పేర్కొంది. కోర్టు చట్టానికి అతీతం కాదు, పరిధి దాటి వ్యవహరించలేం, చర్చలు జరపాలని ప్రభుత్వం లేదా ఆర్‌టిసిని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున తదుపరి చర్యలు చేపట్టలేకపోయినట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు.

Judicial Committee on RTC Strike

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమ్మెపై న్యాయకమిటీ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: