క్యూ2లో జిడిపి 4.2 శాతమే

వార్షిక వృద్ధి 6.1 నుండి 5 శాతానికి.. ఎస్‌బిఐ అంచనా న్యూఢిల్లీ : జూలై-సెప్టెంబర్ త్రైమాసికం(క్యూ2)లో దేశీ య వృద్ధి కేవలం 4.2 శాతం ఉండొచ్చని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అంచనా వేసింది. అలాగే ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో (2019-20) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వార్షిక వృద్ధిని 6.1 శాతం నుండి 5 శాతానికి ఎస్‌బిఐ తగ్గించింది. వాహనాల అమ్మకాలు క్షీణించడం, విమాన ట్రాఫిక్ క్షీణించడం, కీలక రంగాల వృద్ధి మందగించడం, నిర్మాణ-మౌలిక సదుపాయాలలో […] The post క్యూ2లో జిడిపి 4.2 శాతమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
వార్షిక వృద్ధి 6.1 నుండి 5 శాతానికి.. ఎస్‌బిఐ అంచనా

న్యూఢిల్లీ : జూలై-సెప్టెంబర్ త్రైమాసికం(క్యూ2)లో దేశీ య వృద్ధి కేవలం 4.2 శాతం ఉండొచ్చని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అంచనా వేసింది. అలాగే ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో (2019-20) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వార్షిక వృద్ధిని 6.1 శాతం నుండి 5 శాతానికి ఎస్‌బిఐ తగ్గించింది. వాహనాల అమ్మకాలు క్షీణించడం, విమాన ట్రాఫిక్ క్షీణించడం, కీలక రంగాల వృద్ధి మందగించడం, నిర్మాణ-మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు తగ్గడం వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి తగ్గవచ్చని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఎస్‌బిఐ తెలిపింది.

దీంతో ఎస్‌బిఐ కూడా ఇప్పటికే భారత్‌పై ప్రతికూల గణాంకాలు ప్రకటించిన ఎడిబి, ప్రపంచ బ్యాంక్, ఒఇసిడి, ఆర్‌బిఐ, ఐఎంఎఫ్ జాబితాలో చేరినట్టయింది. అయితే 2020-21 నుండి ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని ఎస్‌బిఐ నివేదిక పేర్కొంది. అదే సమయంలో వృద్ధిని వేగవంతం చేయడానికి ఆర్‌బిఐ డిసెంబర్‌లో వడ్డీ రేట్లను మరోసారి తగ్గించవచ్చని వెల్లడించింది. సెప్టెంబరులో పారిశ్రామిక ఉత్పత్తిలో 4.3 శాతం క్షీణతను పరిశీలిస్తే, ఇది అత్యంత పతన దశ అని నివేదిక సూచించింది. నివేదిక ప్రకారం, 2019-20లో దేశ వృద్ధిపై అంతర్జాతీయ అంశాల ప్రభావం ఉందని ఎస్‌బిఐ ఆర్థికవేత్తలు తెలిపారు.

గతవారం మూడీస్ కూడా..

గతవారం భారత్ క్రెడిట్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తగ్గించింది. చాలా కాలంగా మందగమనం కొనసాగుతోందని, అప్పులు పెరుగుతున్న కారణంగా భారత్ రేటింగ్‌లో కోతపెట్టింది. భారత్ క్రెడిట్ రేటింగ్‌ను ‘స్టేబుల్’ నుండి ‘నెగెటివ్’గా మార్చింది. రాబో యే కాలంలో ఆర్థిక వృద్ధి తగ్గే ప్రమాదం ఉన్నందున అంచనా మారిందని మూడీస్ తెలిపింది. మూడీస్ దృక్పథాన్ని తగ్గించడం అంటే ఇది రాబోయే సంవత్సరాల్లో భారతదేశం రేటింగ్‌ను పెట్టుబడి కోణం నుండి తగ్గించవచ్చు. ఈ కారణంగా దేశంలో విదేశీ పెట్టుబడులు తగ్గవచ్చు. మూడీస్ ఇటీవల దృక్పథంలో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ఆందోళన చెందవద్దని చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో సుదీర్ఘమైన సంక్షోభం, తక్కువ ఉపా ధి అవకాశాలు, మరోవైపు బ్యాంకింగ్ రహిత ఆర్థిక సంస్థలలో నగదు కొరత కారణంగా ఆర్థిక మందగమనం పెరిగిందని మూడీస్ పేర్కొంది.

అలాగే ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్య లు మందగమనం సమయం, ప్రభావాన్ని తగ్గించవచ్చని సంస్థ వెల్లడించింది. నామమాత్రపు జిడిపి వృద్ధి వేగవం తం కాకపోతే బడ్జెట్ లోటును తగ్గించడానికి, రుణ భారం పెరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం చాలా ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుందని మూడీస్ వివరించింది. అయితే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి అని ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఫైనాన్స్, ఇతర రంగాలకు సంబంధించి అనేక సంస్కరణలు చేపట్టామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనాన్ని దృష్టిలో ఉంచుకుని విధాన నిర్ణయాలు కూడా తీసుకున్నామని, ఈ చర్యలు దేశ దృక్పథానికి మేలు చేస్తాయి. పెట్టుబడులను పెంచుతాయని కేంద్రం తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్య నిధి తాజా అంచనా ఈ సంవత్సరం భారతదేశ జిడిపి వృద్ధి 6.1 శాతం, వచ్చే ఏడాది 7 శాతంగా అంచనా వేసింది.

GDP Growth rate

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్యూ2లో జిడిపి 4.2 శాతమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: