టాప్‌లోనే బుమ్రా, కోహ్లి

అగ్రస్థానం కాపాడుకున్న ఇంగ్లండ్, ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి (బ్యాటింగ్), జస్‌ప్రిత్ బుమ్రా (బౌలింగ్) విభాగాల్లో అగ్ర స్థానాన్ని కాపాడుకున్నారు. రోహిత్ శర్మ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. భారత్ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఇక, బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కోహ్లి ప్రస్తుతం […] The post టాప్‌లోనే బుమ్రా, కోహ్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
అగ్రస్థానం కాపాడుకున్న ఇంగ్లండ్, ఐసిసి వన్డే ర్యాంకింగ్స్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి (బ్యాటింగ్), జస్‌ప్రిత్ బుమ్రా (బౌలింగ్) విభాగాల్లో అగ్ర స్థానాన్ని కాపాడుకున్నారు. రోహిత్ శర్మ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. భారత్ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఇక, బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కోహ్లి ప్రస్తుతం 895 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కొంతకాలంగా వన్డేల్లో కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్‌లో కూడా కోహ్లి టాప్ ర్యాంక్‌ను కాపాడు కోవడంలో సఫలమయ్యాడు. ఇక, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా ర్యాకింగ్స్‌లో రోహిత్ 863 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

మరోవైపు పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. సౌతాఫ్రికా స్టార్ డుప్లెసిస్ తన నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టైలర్ ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తర్వాతి స్థానాన్ని పొందాడు. ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ క్రికెటర్ జోరూట్ తర్వాతి ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ తొమ్మిదో ర్యాంక్‌లో, ఇంగ్లండ్ స్టార్ జాసన్ రాయ్ పదో స్థానంలో నిలిచారు. ఇక, భారత క్రికెటర్లలో ధావన్ 19వ స్థానంలో నిలిచాడు. ఇదిలావుండగా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం స్పీడ్‌స్టర్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా 797 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కొంతకాలంగా టాప్‌లోనే కొనసాగుతున్న బుమ్రా ఈసారి కూడా దాన్ని కాపాడుకోవడంలో సఫలమయ్యాడు. ఇక, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అఫ్టాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ మూడో ర్యాంక్‌ను కాపాడుకోవడంలో సఫలమయ్యాడు. ఇక, రబడా (సౌతాఫ్రికా) నాలుగో, పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), స్టార్క్ (ఆస్ట్రేలియా), ఆమీర్ (పాకిస్థాన్), మాట్ హెన్రీ (కివీస్), ఫెర్గూసన్ (కివీస్)లు కూడా టాప్ టెన్‌లో చోటు సంపాదించారు. ఇక, టీమ్ ర్యాంకింగ్స్‌లో విశ్వ విజేత ఇంగ్లండ్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 122 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. వరల్డ్‌కప్ రన్నరప్ న్యూజిలాండ్ మూడో, మాజీ విజేత ఆస్ట్రేలియా నాలుగో, సౌతాఫ్రికా ఐదో ర్యాంక్‌లో నిలిచాయి.

Kohli And Bumrah retain top spots in ICC rankings

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టాప్‌లోనే బుమ్రా, కోహ్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: