పిసిసికి త్వరలో కొత్త సారధి!

కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు పరిశీలనలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబుల పేర్లు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త పిసిసి చీఫ్ రానున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం కసరత్తును మొదలు పెట్టింది. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు. పైగా రాష్ట్రంలో జరిగిన వరస ఎన్నిక (అసెంబ్లీ, లోక్‌సభ, గ్రామపంచాయతి, జెడ్‌పి, ఎంపిటిసి)ల్లో కాంగ్రెస్ […] The post పిసిసికి త్వరలో కొత్త సారధి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు
పరిశీలనలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబుల పేర్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త పిసిసి చీఫ్ రానున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం కసరత్తును మొదలు పెట్టింది. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు. పైగా రాష్ట్రంలో జరిగిన వరస ఎన్నిక (అసెంబ్లీ, లోక్‌సభ, గ్రామపంచాయతి, జెడ్‌పి, ఎంపిటిసి)ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. చివరకు ఇటీవల హుజూర్‌నగర్ నియోజకవర్గానికి జరిపిన ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా ఉత్తమ్‌కుమార్ తన భార్య పద్మావతిని నిలబెట్టారు. అయినప్పటికీ ఆ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయాన్ని చవి చూసింది. దీంతో ఎప్పటి నుంచో కాంగ్రెస్‌కు కంచుకోటగా వస్తున్న ఆ నియోజకవర్గం సైతం చేజారింది. ఈ పరిణామాలన్నీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించాయి.

త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు సైతం తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడిగా కొనసాగడం కంటే తప్పుకోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత్రిని కలిసి పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించాల్సిందిగా కోరారు. ఇక పార్టీనేతల కూడా ఉత్తమ్ మార్చాల్సిందేనన్న డిమాండ్లు పెద్దఎత్తున రావడంతో పార్టీ అధిష్టానం కూడా కొత్త నేత కోసం కసరత్తును మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఎంపిలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటు మాజీ సిఎల్‌పి నాయకుడు జానారెడ్డి, మంథని శాసనసభ్యుడు డి. శ్రీధర్‌బాబుల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతల అభిప్రాయలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పడుతుండగా, పార్టీ హైకమాండ్ మాత్రం నలుగురు పేర్లు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి ఉత్తమ్ పదవీకాలం ఏడాది కిందటే పూర్తయింది. అయినా.. వరుస ఎన్నికల నేపథ్యంలో అధిష్ఠానం ఆయననే కొనసాగించింది. అయిచే ఇటీవల సిడబ్లూసి నేత గులాం నబీ ఆజాద్ హైదరాబాద్‌కు వచ్చిన సమయంలోనూ మునిసిపల్ ఎన్నికలకు ముందే టిపిసిసికి కొత్త సారథిని నియమించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ పదవిని తాను ఆశిస్తున్నట్లు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరి సమక్షంలోనే ఆజాద్‌కు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పిసిసి అధ్యక్ష పదవికి రేవంత్‌రెడ్డి పేరును అధిష్ఠానం ప్రధానంగా పరిశీలించింది. అయితే పలువురు అభ్యంతరం తెలపడం, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో ఆ అంశాన్ని పక్కన పెట్టింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తర్వాత మళ్లీ ఈ ప్రచారం ఊపందుకుంది. కాగా బిసి కోటాలో పిసిసి చీఫ్ పదవిని వి.హన్మంతరావు కూడా ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు తాను కూడా పిసిసి చీఫ్ రేసులో తాను కూడా ఉన్నానంటూ సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి బహిరంగంగానే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఒక వేళ పార్టీ అధిష్టానం ఎస్‌సికి అవకాశం కల్పించాలని భావిస్తే తనకు అవకాశం ఉంటుందని పార్టీ సీనియర్ నేత సంపత్ భావిస్తున్నారు. అలాగే మాజీ ఎంపి మధుయాష్కీ సైతం తన ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్‌కు ప్రత్యామ్నాయంగా జానారెడ్డి పేరును కొందరు, వివాద రహితుడిగా పేరున్న శ్రీధర్‌బాబును మరికొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి గతంలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రతికూలంగా మా రే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో నిర్జీవంగా మారిన కాంగ్రెస్ తిరిగి జవసత్వాలు అందించేందుకు ధీటైన నాయకుడిని ఎంపిక చేసే విషయంలో ఎఐసిసి నిమగ్నమైంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాలపై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15 వరకు నిరసనలు తలపెట్టింది. దీంతో పిసిసి ఎంపిక ప్రక్రియ అనంతరం వేగవంతం చేసే అవకాశం ఉందంటున్నారు. అందులో ప్రధానంగా అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ఎంపిక పైనే ప్రధానం ఫోకస్ చేసినట్లు సమాచారం.

Who Is Race For New TPCC Chief In Congress

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పిసిసికి త్వరలో కొత్త సారధి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: