మావోయిస్టు దంపతుల అరెస్టు

హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు దంపతులను ఎల్‌బి నగర్, స్పెషల్ టీం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి విప్లవ సాహిత్యం, మూడు ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత దంపతులు తమ ఇంటి నుంచే మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలం, తిరుమలాయపురం గ్రామానికి చెందిననార్ల రవిశర్మ(54) నగరంలోని ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 198486లో బి. ఎస్సీ అగ్రికల్చర్ చేశాడు. ఇతడు మావోయిస్టు […] The post మావోయిస్టు దంపతుల అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు దంపతులను ఎల్‌బి నగర్, స్పెషల్ టీం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి విప్లవ సాహిత్యం, మూడు ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత దంపతులు తమ ఇంటి నుంచే మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలం, తిరుమలాయపురం గ్రామానికి చెందిననార్ల రవిశర్మ(54) నగరంలోని ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 198486లో బి. ఎస్సీ అగ్రికల్చర్ చేశాడు.

ఇతడు మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడే అనురాధను వివాహం చేసుకున్నాడు. చదువుకునేటప్పుడే హైదరాబాద్ ఆర్‌ఎస్‌యూ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలోనే అప్పటి పీపుల్స్‌వార్ డిసిఎం మేకల దామోదర్ రెడ్డి అలియాస్ మదన్ సిటీ కార్యదర్శిగా పనిచేసేవాడు. అతడితో రవిశర్శకు పరిచయం ఏర్పడింది. 1988లో ఆర్టిసి బస్సు ధ్వంసం చేసిన కేసు,సైదాబాద్‌లో మీర్‌పేటలో కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేయగా తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. 199293లో హైదరాబాద్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రై లాండ్ అగ్రికల్చర్(సిఆర్‌ఐడిఏ)లో పనిచేశాడు.

అండర్‌గ్రౌండ్‌కు…

ఆర్‌ఎస్‌యూలో చురుగ్గా పాల్గొంటున్న రవిశర్మ 1998లో బీహార్, జార్ఖండ్‌కు అండర్ గ్రౌండ్‌లో వెళ్లాడు అక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. 1999లో జార్ఖండ్, పాలం, లతేహార్ జడ్‌సిఎంగా పనిచేశాడు. 2001లో బిజే ఎస్‌ఎసి సభ్యుడిగా పనిచేసిన రవిశర్మ మిలటరీ అఫైర్స్‌ను 2006కు చుశాడు. బీహార్‌లోని భీంబంద్ ఫారెస్ట్‌లో నిర్వహించిన 9వ కాంగ్రెస్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్టోబర్ 17వతేదీ, 2009లో బీహార్ రాష్ట్రం, హజారీబాగ్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి రవిశర్శ ఏప్రిల్ 4వ తేదీ, 2016లో విడుదలయ్యాడు. తర్వాత తన భార్య మాజీ మావోయిస్టు అనురాధతో కలిసి నగరంలోని అంబర్‌పేటలో నివాసం ఉంటున్నాడు. ఇతడిపై 16కేసులు తెలంగాణ, జార్ఖండ్, ఎంపిలో ఉన్నాయి.

తరచూ అజ్ఞాతంలోకి….

మావోయిస్టుల్లో పనిచేసిన రవిశర్శ జైలు నుంచి విడుదలైన తర్వాత తరచూ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లి ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్లి టాప్ మావోయిస్టులతో సమావేశమయ్యేవాడు. ఈ క్రమంలో 2018, జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు భార్య అనురాధతోకలిసి దండకారణ్యంలోకి వెళ్లాడు. 2018 నవంబర్‌లో మాజీ సిసిఎం జంటు ముఖర్జీ, బిపి సింగ్‌ను కోల్‌కతాలో కలిశాడు, 2019లో వారణిసి సుబ్రహ్మమణ్యంను హైదరాబాద్‌లో కలిశాడు. ఆల్ ఇండియా ఫోరం అగేనెస్ట్ హిందుత్వా ఫాసిస్ట్ అఫెన్‌సివ్‌ను 2019, ఫిబ్రవరిలో ఢిల్లీలో స్థాపించాడు. దేశం, రాష్ట్రానికి వ్యతిరేకంగా కార్యకలపాలు నిర్వర్తిస్తున్నాడు.

Maoist couple arrested by LB Nagar police

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మావోయిస్టు దంపతుల అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: