విశాల్ అభిమానులకు పండుగలా ‘యాక్షన్’

  ఒక వైపు గ్లామర్ పాత్రల్లో కనిపిస్తూనే మరో వైపు బాహుబలి, సైరా లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలలో పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం మాస్ హీరో విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యాక్షన్’. హుషారు, ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, రాజుగారిగది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్ […] The post విశాల్ అభిమానులకు పండుగలా ‘యాక్షన్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒక వైపు గ్లామర్ పాత్రల్లో కనిపిస్తూనే మరో వైపు బాహుబలి, సైరా లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలలో పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం మాస్ హీరో విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యాక్షన్’. హుషారు, ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, రాజుగారిగది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ‘యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈనెల 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నాతో ఇంటర్వూ విశేషాలు…
మంచి పేరు వస్తుంది…

ఈ సంవత్సరం ప్రారంభంలోనే ‘ఎఫ్ 2 ’తో మంచి విజయం లభించింది. అలాగే గొప్ప చారిత్రాత్మక చిత్రం ‘సైరా’లో విప్లవమాత్మకంగా ఉండే లక్ష్మీ క్యారెక్టర్ నటిగా నాకు మంచి పేరు, ప్రశంసలు తీసుకువచ్చింది. ఇప్పుడు ‘యాక్షన్’ మూవీ కూడా గ్యారెంటీగా నాకు మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో ఉన్నాను.

నా క్యారెక్టర్ బలంగా…
ఈ సినిమాలో విశాల్, నేను కమాండోలుగా కనిపిస్తాము. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ చూస్తే అందులో హీరోయిన్స్ ‘షీరో’గా ఉంటారు. అంటే గ్లామరస్‌గా కనిపిస్తూనే చాలా బలంగా ఉంటారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. మా డైరెక్టర్ సుందర్ నా క్యారెక్టర్‌ని చాలా బలంగా డిజైన్ చేశారు.

ఈ జోనర్‌లో మరిన్ని చేస్తా…
దర్శకుడు సుందర్ నాకు ఫోన్ చేసి ‘ఈ క్యారెక్టర్ నువ్వే చెయ్యాలి’ అన్నారు. నేను ఎప్పటినుండో ఆయన డైరెక్షన్‌లో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. నాకు స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. అందులోనూ రెగ్యులర్‌గా కాకుండా కొత్తగా ఉంది. ఈ క్యారెక్టర్ నాకు భవిష్యత్తులో కూడా యాక్షన్ సీక్వెన్స్‌లు చేయగలను అనే నమ్మకాన్నిచ్చింది. ఈ జోనర్‌లో నేను మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా.

అందరూ సహకరించడంతో…
ఈ సినిమా కోసం అజర్‌బైజాన్, టర్కీ, రిషికేష్… ఇలా చాలా ప్రదేశాలు ప్రయాణించాం. అక్కడ యాక్షన్ సీన్లు తీయడమంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. సెక్యూరిటీ, పర్మిషన్స్ ఇలా చాలా అంశాలు ఉంటాయి. అయితే అందరూ పూర్తిగా సహకరించడంతో మా పని తొందరగా అయిపోయింది.

ప్రేక్షకులు మెచ్చుకుంటారు…
ఈ సినిమాకు హిప్‌హాప్ తమిళ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దీంతో పాటు అద్భుతమైన ఆర్.ఆర్. కూడా ఇచ్చారు. కొన్ని సీన్లలో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. మా యూనిట్‌లో ప్రతి ఒక్కరూ ఆయన్ను ప్రశంసించారు. రేపు సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా తప్పకుండా మెచ్చుకుంటారు.

పూర్తి న్యాయం చేశారు…
– ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్ష పూరి, ఛాయా సింగ్… ఇలా చాలా మంచి ఆర్టిస్టులున్నారు. ప్రతి క్యారెక్టర్‌కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. వారు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్…
సుందర్. సి చాలా అనుభవమున్న దర్శకుడు. దాదాపు అన్ని జోనర్‌లలో సినిమాలు తీసి మంచి దర్శకుడిగా నిరూపించుకున్నారు. అయితే ‘యాక్షన్’ సినిమా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. స్క్రీన్‌ప్లే కూడా రేసీగా ఉంటుంది. లొకేషన్స్ గ్రాండియర్‌గా ఉంటాయి. ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభవాన్నిచ్చింది. ఆయన ప్లానింగ్ చాలా పక్కాగా ఉంటుంది.

అభిమానులకు పండుగలా…
– ఏ యాక్షన్ సినిమా అయినా సరే ఎమోషన్స్ సరిగ్గా కనెక్ట్ అయితేనే ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. విశాల్ ఎమోషన్స్‌కి కనెక్ట్ అవుతారు కనుకనే ఆయన యాక్షన్‌ను అంతలా ఇష్టపడతారు ప్రేక్షకులు. విశాల్ సెట్‌లో ఒక డేర్‌డెవిల్‌లా పర్‌ఫార్మ్ చేస్తారు. మామూలుగానే విశాల్ యాక్షన్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇప్పుడు పూర్తిగా యాక్షన్‌తో కూడిన ఈ చిత్రం అభిమానులకు పండుగలా ఉంటుంది. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్ మూవీ అవుతుంది.

Interview with Tamanna

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విశాల్ అభిమానులకు పండుగలా ‘యాక్షన్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.