నా పాత్రలో రెండు వేరియేషన్స్

  సందీప్ కిషన్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ సంధర్భంగా సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… ఈ సినిమాకి బలం కామెడీ… తెనాలి రామకృష్ణ అనేవాడు కర్నూలులో ఒక తెలివైన లాయర్. తన క్యారెక్టరైజేషన్ పూర్తిగా ఫన్‌తో సాగుతుంది. ప్రతి […] The post నా పాత్రలో రెండు వేరియేషన్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సందీప్ కిషన్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ సంధర్భంగా సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఈ సినిమాకి బలం కామెడీ…
తెనాలి రామకృష్ణ అనేవాడు కర్నూలులో ఒక తెలివైన లాయర్. తన క్యారెక్టరైజేషన్ పూర్తిగా ఫన్‌తో సాగుతుంది. ప్రతి సినిమాలో ఏదో ఒకటి బలంగా ఉంటుంది. అలాగే ఈ సినిమాకి బలం కామెడీ. ఇది పక్కా కామెడీ బేస్డ్ మూవీ.

ఎమోషన్స్ కూడా ఉంటాయి…
కేసులతో రాజీపడితే ఎలాంటి గొడవలు ఉండవని బలంగా నమ్మే హీరో చివరకు ఒక కేసు విషయంలో మాత్రం అసలు కాంప్రమైజే వద్దని అనుకుంటాడు. సరదాగా ఉండే అతను అంతే సీరియస్‌గా మారతాడు. హీరో పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. నా పాత్రలో కేవలం కామెడీనే కాకుండా మిగిలిన ఎమోషన్స్ కూడా ఉంటాయి.

అవన్నీ దృష్టిలో పెట్టుకొని…
నేను ముందుగా కథ నేపథ్యం గురించి పూర్తిగా అర్ధం చేసుకుంటాను. ఆ కథలో నా పాత్ర ఎలాంటిది? ఆ పాత్ర ఏ సీన్‌లో ఎలా ప్రవర్తిస్తుంది? అలాగే ఆ పాత్ర గెటప్, డిక్షన్… ఇలా ప్రతీది గమనిస్తాను. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నటిస్తాను.

నవ్వుతూనే ఉంటారు…
ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. మాకు ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉంది.

తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం ‘తెనాలి రామకృష్ణ’ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా తరువాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ మూవీ చేస్తున్నాను. దీని తర్వాత ఎలాంటి సినిమా ఒప్పుకోలేదు.

interview with Sandeep Kishan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నా పాత్రలో రెండు వేరియేషన్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: