హృతిక్‌పై అభిమానం…ఆయువు తీసింది!

  తట్టుకోలేక భార్యను హతమార్చిన భర్త ఆత్మహత్య న్యూయార్క్‌లో భారతీయ జంట విషాదాంతం న్యూయార్క్ : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌పై పెంచుకున్న అమితమైన అభిమానం ఇద్దరి ప్రాణాలు పోయేంత వరకు వచ్చింది. హీరోగా అంతగా ఆరాధించడాన్ని తట్టుకోలేని భర్త తన భార్యను దారుణంగా హతమార్చాడు. తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అమెరికాలోని న్యూ యార్క్‌లో జరిగింది. భారత్‌కు చెందిన దినేశ్వర్(33), డొజాయ్(27) ఇద్దరు కొంత కాలం క్రితం వివాహం చేసుకున్నారు. డొజాయ్ బార్‌టెండర్‌గా […] The post హృతిక్‌పై అభిమానం… ఆయువు తీసింది! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తట్టుకోలేక భార్యను హతమార్చిన భర్త ఆత్మహత్య
న్యూయార్క్‌లో భారతీయ జంట విషాదాంతం

న్యూయార్క్ : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌పై పెంచుకున్న అమితమైన అభిమానం ఇద్దరి ప్రాణాలు పోయేంత వరకు వచ్చింది. హీరోగా అంతగా ఆరాధించడాన్ని తట్టుకోలేని భర్త తన భార్యను దారుణంగా హతమార్చాడు. తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అమెరికాలోని న్యూ యార్క్‌లో జరిగింది. భారత్‌కు చెందిన దినేశ్వర్(33), డొజాయ్(27) ఇద్దరు కొంత కాలం క్రితం వివాహం చేసుకున్నారు. డొజాయ్ బార్‌టెండర్‌గా జాబ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడి కీన్స్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వీరిద్దరికి హృతిక్ విషయంలో తరచూ గొడవలు జరిగేవి. డొజాయ్ ఎప్పుడూ హృతిక్ రోషన్ పాటలు, సినిమాలు చూస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటుంది.

అది మానుకోవాలని భర్త పలుమార్లు హెచ్చరించినా డొజాయ్ పట్టించుకోలేదు. దీంతో కోపమొచ్చిన దినేశ్వర్ పలు మార్లు ఆమెను శారీరకంగా హింసించాడు. ఈ విషయం స్నేహితురాళ్లకు కూడా డొజాయ్ చెప్పుకుని బాధపడేది. ఒకసారి హృతిక్ సినిమా చూడకుండా దినేశ్వర్ అడ్డుకోవడం, మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగడం.. చిత్రహింసలకు గురిచేయడంతో డొజాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆగస్టు 21న దినేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ నేరాన్ని అంగీకరించిన అతడికి కోర్టు జైలు శిక్ష విధించింది. గత బుధవారంనాడు జైలు నుంచి విడుదలైన దినేశ్వర్ నేరుగా భార్య డొజాయ్ ఉంటున్న నివాసానికి వెళ్లి కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దినేశ్వర్‌కు డొజాయ్ అంటే చాలా ఇష్టమని, కానీ హృతిక్‌ను ఆమె ఎక్కువగా ఆరాధించడం వల్లే ఈ ఘటనకు పూనుకున్నాడని డొజాయ్ ఫ్రెండ్స్ పేర్కొన్నారు.

husband killed wife for her crush with Hrithik Roshan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హృతిక్‌పై అభిమానం… ఆయువు తీసింది! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: