వాయు కాలుష్యంతో గుండెజబ్బులు

  వంటింటి కాలుష్యంతో మహిళలకు తీరని ముప్పు స్పెయిన్ ఐఎస్ గ్లోబల్ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్ పరిసరాల్లో 3372 మందిపై సాగిన అధ్యయనం లండన్ : ఇంటి లోని, పరిసరాల్లోని అత్యధిక స్థాయి వాయుకాలుష్యం గుండె పోటు, పక్షవాతం, వంటి హృదయ కోశ వ్యాధులకు దారి తీస్తుందని స్పెయిన్‌కు చెందిన అధ్యయనం వెల్లడించింది. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్తు (ఐఎస్ గ్లోబల్) శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం సాగించింది. ఇంటి లోని, ఇంటి చుట్టూ […] The post వాయు కాలుష్యంతో గుండెజబ్బులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వంటింటి కాలుష్యంతో మహిళలకు తీరని ముప్పు
స్పెయిన్ ఐఎస్ గ్లోబల్ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ పరిసరాల్లో 3372 మందిపై సాగిన అధ్యయనం

లండన్ : ఇంటి లోని, పరిసరాల్లోని అత్యధిక స్థాయి వాయుకాలుష్యం గుండె పోటు, పక్షవాతం, వంటి హృదయ కోశ వ్యాధులకు దారి తీస్తుందని స్పెయిన్‌కు చెందిన అధ్యయనం వెల్లడించింది. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్తు (ఐఎస్ గ్లోబల్) శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం సాగించింది. ఇంటి లోని, ఇంటి చుట్టూ విస్తరించే వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలకు గుండెజబ్బులకు గల సంబంధాన్ని ఈ విధంగా వెల్లడించిన మొట్టమొదటి అధ్యయనం ఇదే. ఈ వాయు కాలుష్యానికి స్వల్ప, మధ్యతరహా ఆదాయం గల భారత దేశం లోని జనాభాలో ఎధెరోస్లిరోసిస్ లేదా ధమనులు దళసరి అవుతాయని గుండె జబ్బులకు దారి తీస్తాయని అధ్యయనం వివరించింది.

తెలంగాణ లోని హైదరాబాద్ అర్బన్ ప్రాంతాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు కెరోటిడ్ ఇంటిమామెడియా థిక్‌నెస్ (సిఐఎంటి) సన్నని ధూళి కణాలకు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని అంటే వీరికి గుండెజబ్బులు లేదా పక్షవాతం ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది. మొత్తం 3372 మందిని అధ్యయనంలో చేర్చుకుని పరిశీలించారు. ఈ అధ్యయనం ఎపిడెమియోలజీ ఇంటర్నేషనల్ జర్నల్‌లో వెల్లడైంది. ల్యాండ్ యూజ్ రిగ్రెసన్ (ఎల్‌యుఆర్ ) అనే ఆల్గోరిథమ్ ఉపయోగించి సిఐఎంటిని లెక్కకట్టారు. దీనివల్ల 2.5 మైక్రోమీటర్ల పరిమాణంలో కాలుష్య రేణువులు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది.

అధ్యయనంలో చేరిన వారివల్ల ఎలాంటి రకం వంట ఇంధనాన్ని వాడుతున్నారో కూడా సమాచారం తెలిసింది. ఇంటి లోని లేదా పరిసరాల్లోని వాయు కాలుష్యం రేణువులు ఏటా సిఐఎంటి ఎక్కువ స్థాయితో ప్రభావితమవుతాయని వెల్లడైంది. అధ్యయనంలో పాల్గొన్న 40 ఏళ్లకు మించిన వారిలో ముఖ్యంగా పురుషుల్లో గుండెజబ్బులు, పక్షవాతం వంటి లక్షణాలు కనిపించాయి. వీరిలో 60 శాతం మంది పిడకలు, కట్టెలు వంటి జీవ ఇంధనాలనే వంట చెరకుగా వినియోగిస్తున్నట్టు తేలింది. ఎవరైతే ఇటువంటి జీవ ఇంధనాలను వంట చెరకుగా వినియోగిస్తుంటారో అటువంటి మహిళల్లో పురుషులు కన్నా అత్యధికంగా సిఐఎంటి కనిపించింది.

ముఖ్యంగా వెంటిలేటర్లు లేని చోట వంట సాగించే మహిళల్లో ఇది ఎక్కువగా ఉందని ఐఎస్ గ్లోబల్ పరిశోధకుడు ఒటావియో రంజానీ చెప్పారు. పురుషులు కన్నా మహిళల్లో ఇది ఎక్కువ స్థాయిలో కనిపించడానికి వారు వంటగదిలో ఎక్కువసేపు గడపడమే. భారత్ వంటి దేశాలకు ఈ అధ్యయనం వర్తిస్తుంది. రక్తపు పోటు,డయాబెటిస్, స్థూలకాయం వంటివి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ ప్రభావం బాగా ఉంటుందని ఐఎస్‌గ్లోబల్ పరిశోధకులు కేథరిన్ చెప్పారు. స్వల్ప, మధ్యతరహా ఆదాయ దేశాల్లో వాయు కాలుష్యంపై ఇలాంటి అధ్యయనాలు అవసరమన్నారు.

Heart disease with air pollution

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాయు కాలుష్యంతో గుండెజబ్బులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: