గాయని లతా మంగేష్కర్‌కు అస్వస్థత

  ముంబయి : అస్వస్థతకు గురైన సినీరంగ శిఖరాగ్ర గాయని లతామంగేష్కర్‌ను సోమవారం ఉదయం ఇక్కడి బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్సా విభాగంలో (ఐసియు) చేర్పించారు. శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉందని లతామంగేష్కర్ చెప్పడంతో సోమవారం ఉదయం ఆమెను బ్రీచ్ క్యాండీలో చేర్పించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 28న 90వ ఏట అడుగుపెట్టిన లెజెండ్ సింగర్ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉందని వారు పేర్కొన్నారు.‘రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. […] The post గాయని లతా మంగేష్కర్‌కు అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి : అస్వస్థతకు గురైన సినీరంగ శిఖరాగ్ర గాయని లతామంగేష్కర్‌ను సోమవారం ఉదయం ఇక్కడి బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్సా విభాగంలో (ఐసియు) చేర్పించారు. శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉందని లతామంగేష్కర్ చెప్పడంతో సోమవారం ఉదయం ఆమెను బ్రీచ్ క్యాండీలో చేర్పించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 28న 90వ ఏట అడుగుపెట్టిన లెజెండ్ సింగర్ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉందని వారు పేర్కొన్నారు.‘రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె ఆరోగ్యం సీరియస్ ఉంది’ అని ఆస్పత్రి ఉద్యోగి ఒకరు చెప్పారు. హిందీ చిత్రాల్లోనే కాకుండా అనేక భారతీయ భాషల్లో కూడా లతామంగేష్కర్ వేలాది పాటలు పాడారు. గానప్రపంచంలో శిఖరాయమానంగా వెలుగుతున్న లతాకు భారతప్రభుత్వం 2001లో దేశంలోని అత్యున్నత పౌరపురస్కారం ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించింది.

Lata Mangeshkar admitted to ICU of Breach Candy Hospital

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గాయని లతా మంగేష్కర్‌కు అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: