తీవ్ర హెచ్చుతగ్గులు

  స్వల్పంగా 21 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ న్యూఢిల్లీ: గతవారం రికార్డు స్థాయికి చేరుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు పెరిగి 40,345 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 11,913 వద్ద స్థిరపడింది. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ దేశ ఔట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో వారాంతంలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈవారం కూడా ఈ ప్రభావం కాస్త కనిపించింది. […] The post తీవ్ర హెచ్చుతగ్గులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్వల్పంగా 21 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: గతవారం రికార్డు స్థాయికి చేరుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు పెరిగి 40,345 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 11,913 వద్ద స్థిరపడింది. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ దేశ ఔట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో వారాంతంలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈవారం కూడా ఈ ప్రభావం కాస్త కనిపించింది. ట్రేడర్లు మరోసారి అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందంపై సానుకూల అంచనాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి.

రంగాల వారీగా చూస్తే మీడియా 3 శాతం పెరగ్గా, బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం, రియల్టీ 0.7 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే ఐటి, ఎఫ్‌ఎంసిజి 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్ బ్యాంక్ 6 శాతం జంప్‌చేయగా, బిపిసిఎల్, గెయిల్, టాటా మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్, ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్ పెరిగాయి. అలాగే నెస్లే, హీరో మోటో, హిందాల్కో, వేదాంతా, సిప్లా, ఐషర్, గ్రాసిమ్, టిసిఎస్, ఆర్‌ఐఎల్, ఏసియన్ పెయింట్స్ డీలాపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్స్ బలపడ్డాయి. నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.932 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.584 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించాయి.

Sensex Closes 21 Points Higher

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తీవ్ర హెచ్చుతగ్గులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: