జెఎన్‌యు విద్యార్థుల ఆందోళన

  ఫీజులు, డ్రెస్‌కోడ్‌పై నిరసన బ్యారికేడ్లను విరగ్గొట్టిన స్టూడెంట్స్, యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడు ప్రసంగం, ఆడిటోరియంలోనే ఉండిపోయిన హెచ్‌ఆర్‌డి మంత్రి న్యూఢిల్లీ : విద్యార్థులకు వ్యతిరేక విధానాలు చేపడుతున్న పాలకమండలి వైఖరికి నిరసనగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీకి (జెఎన్‌యు) చెందిన వందలాదిమంది విద్యార్థులు సోమవారం ఆందోళన చేశారు. హాస్టల్ మాన్యువల్ ముసాయిదాలో ఫీజులు పెంచే ప్రతిపాదన, డ్రెస్‌కోడ్, పార్థసారథి రాక్స్‌లో ప్రవేశానికి ఆంక్షల విధింపు, స్టూడెంట్స్ యూనియన్ ఆఫీస్‌ను మూసే ప్రయత్నాలు ఉప సంహరించుకోవాలని […] The post జెఎన్‌యు విద్యార్థుల ఆందోళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఫీజులు, డ్రెస్‌కోడ్‌పై నిరసన
బ్యారికేడ్లను విరగ్గొట్టిన స్టూడెంట్స్, యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత
స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడు ప్రసంగం, ఆడిటోరియంలోనే ఉండిపోయిన హెచ్‌ఆర్‌డి మంత్రి

న్యూఢిల్లీ : విద్యార్థులకు వ్యతిరేక విధానాలు చేపడుతున్న పాలకమండలి వైఖరికి నిరసనగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీకి (జెఎన్‌యు) చెందిన వందలాదిమంది విద్యార్థులు సోమవారం ఆందోళన చేశారు. హాస్టల్ మాన్యువల్ ముసాయిదాలో ఫీజులు పెంచే ప్రతిపాదన, డ్రెస్‌కోడ్, పార్థసారథి రాక్స్‌లో ప్రవేశానికి ఆంక్షల విధింపు, స్టూడెంట్స్ యూనియన్ ఆఫీస్‌ను మూసే ప్రయత్నాలు ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వైస్ ఛాన్స్‌లర్‌ను కలుసుకునేందుకు ప్రయత్నించారు. విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తున్న అఖిలభారత సాంకేతిక విద్యామండలికి (ఎఐసిటిఇ) ఆడిటోరియం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే జెఎన్‌యుకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఎఐసిటిఇ గేట్లను మూసేశారు. ఉదయమే విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ప్రారంభం కావడంతో ఆవరణ లోపల, బయట భద్రతా బలగాలను నియమించారు. జెఎన్‌యు క్యాంపస్‌లో ఉత్తర, పశ్చిమ గేట్ల బయట, ఆడిటోరియాన్ని చేరే బాబా బాలక్‌నాథ్‌మార్గంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశామని ఓ అధికారి తెలిపారు. అయితే, విద్యార్థులు వాటిని బలవంతంగా విరగగొట్టి ఉదయం 11.30 ప్రాంతంలో వేదికి వద్దకు మార్చ్ చేస్తూ వెళ్లారు. అక్కడ వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఆడిటోరియంలోనే హెచ్‌ఆర్‌డి మంత్రి
బయట విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేస్తున్న సమయంలో కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఎఐసిటిఇ ఆడిటోరియంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఆయన స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు ఆడిటోరియానికి వెళ్లారు. ‘మంత్రి లోపల ఉన్నారు. పరిస్థితిని అదుపు చేశాం. మం త్రి జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడితో మాట్లాడి, డిమాండ్లు తీరుస్తానని హామీ ఇచ్చారు’ అని హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు.

JNU students protest over fee hike, dress code

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జెఎన్‌యు విద్యార్థుల ఆందోళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: