పారిశ్రామిక ఉత్పత్తి డీలా

  సెప్టెంబర్‌లో 4.3 శాతం ఉత్పాదక రంగం గణనీయంగా క్షీణించింది న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమన సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపి) సెప్టెంబర్‌లో 4.3 శాతానికి క్షీణించడమే ఇందుకు ఉదాహారణ. ఐఐపి 2018 సెప్టెంబరులో ఇదే నెలలో 4.6 శాతం వృద్ధిని చూపించింది. 2011 అక్టోబర్‌లో పతనం తర్వాత ఐఐపి ఇంతలా క్షీణించడం ఇదే. తయారీ రంగం, గనులు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి లేకపోవడం వల్ల గణాంకాలు ఆశించిన మేరకు లేవు. […] The post పారిశ్రామిక ఉత్పత్తి డీలా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సెప్టెంబర్‌లో 4.3 శాతం
ఉత్పాదక రంగం గణనీయంగా క్షీణించింది

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమన సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపి) సెప్టెంబర్‌లో 4.3 శాతానికి క్షీణించడమే ఇందుకు ఉదాహారణ. ఐఐపి 2018 సెప్టెంబరులో ఇదే నెలలో 4.6 శాతం వృద్ధిని చూపించింది. 2011 అక్టోబర్‌లో పతనం తర్వాత ఐఐపి ఇంతలా క్షీణించడం ఇదే. తయారీ రంగం, గనులు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి లేకపోవడం వల్ల గణాంకాలు ఆశించిన మేరకు లేవు. పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా రెండవ నెలలో క్షీణించింది. ఆగస్టులో 1.1 శాతానికి పడిపోయింది.

ఉత్పాదక రంగం పనితీరు సరిగా లేనందున సెప్టెంబరులో ఐఐపి గణనీయంగా తగ్గింది. ఈ రంగంలో 3.9 శాతం కార్యకలాపాలు తగ్గాయి. ఉత్పాదక రంగంలోని 23 పారిశ్రామిక గ్రూప్‌లో 17 రంగాలకు వృద్ధి ప్రతికూలంగా ఉంది. గణాంకాల శాఖ సోమవారం ఈ ఐఐపి గణాంకాలను విడుదల చేసింది. విద్యుత్ ఉత్పత్తి విషయానికొస్తే సెప్టెంబరులో ఇది 2.6 శాతానికి పడిపోయింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 8.2 శాతం వృద్ధిని సాధించింది. మైనింగ్ ఉత్పత్తిలో 8.5 శాతం పెద్ద క్షీణత ఉండగా, 2018 సెప్టెంబర్‌లో ఇది 0.1 శాతం వృద్ధిని చూపించింది.

ఏ రంగం స్థితి ఏమిటి?
వివిధ రంగాల ఉత్పత్తి వృద్ధి ఇలా ఉంది. తయారీ – 3.9 శాతం, మైనింగ్ – 8.5 శాతం, మూలధన వస్తువులు – 20.7 శాతం, మౌలిక సదుపాయాల వస్తువులు – శాతం, విద్యుత్ – 2.6 శాతం, ప్రైమరీ ఆర్టికల్స్ – 5.1 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 9.9 శాతం, కన్స్యూమర్ నాన్-డ్యూరబుల్స్ – 0.4 శాతంగా ఉంది.

Industrial production contracts 4.3% in September

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పారిశ్రామిక ఉత్పత్తి డీలా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: