రెవెన్యూ సిబ్బందికి కెటిఆర్ అభయం

  15 రోజుల్లో సమస్యలకు పరిష్కారం హైదరాబాద్ : రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో సిఎం కెసిఆర్ పరిష్కరిస్తారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులకు మంత్రి కెటిఆర్ హామినిచ్చారు. సోమవారం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్ ఆధ్వర్యంలో మంత్రి కెటిఆర్‌ను కలిశారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు కెటిఆర్‌కు వివరించారు. […] The post రెవెన్యూ సిబ్బందికి కెటిఆర్ అభయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

15 రోజుల్లో సమస్యలకు పరిష్కారం

హైదరాబాద్ : రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో సిఎం కెసిఆర్ పరిష్కరిస్తారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులకు మంత్రి కెటిఆర్ హామినిచ్చారు. సోమవారం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్ ఆధ్వర్యంలో మంత్రి కెటిఆర్‌ను కలిశారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు కెటిఆర్‌కు వివరించారు. ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు నిర్వహించాలంటే భయబ్రాంతులు గురవుతున్నారని, సంవత్సర కాలంగా తహసీల్దార్ల బదిలీలు జరగకపోవడంతో వారు కుటుంబానికి దూరంగా ఉండడంతో వారు అనారోగ్యానికి గురవుతున్నారని వారు మంత్రితో పేర్కొన్నారు.

ట్రెసా నాయకులు లేవనెత్తిన అంశాలపై మంత్రి కెటిఆర్ స్పందిస్తూ 15 రోజుల్లో సిఎం కెసిఆర్ రెవెన్యూ ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మంత్రి ట్రెసా నాయకులతో పేర్కొన్నారు. వెంటనే ఉద్యోగులు విధుల్లో చేరానని కెటిఆర్ వారికి సూచించారు. తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం సంఘటన తనను కలచివేసిందని, తన కుటుంబసభ్యులు కూడా ఈ సంఘటనపై ఆవేదన చెందారని కెటిఆర్ ట్రెసా నాయకులతో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెవెన్యూ ఉద్యోగులు విధులు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని, వారికి తగిన రక్షణ కల్పిస్తామని కెటిఆర్ ట్రెసా నాయకులకు హామినిచ్చారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సిఎం కెసిఆర్ సమావేశమై సమస్యలను పరిష్కరిస్తారని ఈ విషయాన్ని ఉద్యోగులకు చేరవేయాలని ఆయన ట్రెసా నాయకులతో పేర్కొన్నారు.

తహసీల్దార్ కార్యాలయాలకు భద్రత కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు అదనపు డిజిపి ఆదేశం
ప్రభుత్వ తరఫున అన్ని విధాలా ఆదుకుంటాం: రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్
అనంతరం ట్రెసా నాయకులు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ను మాసబ్‌ట్యాంక్‌లోని రెరా కార్యాలయంలో కలిశారు. అనంతరం ఆయన అదనపు డిజిపి జితేందర్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు డిజిపి జితేందర్ అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడి ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి పోలీసు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ ట్రెసా నాయకులను ఉద్ధేశించి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించడానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా తాము చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

ఉద్యోగులు విధుల్లో చేరాలని మిగతా సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన పేర్కొన్నారు. త్వరలో వాటిపై సిఎం కెసిఆర్ ఉద్యోగులకు అనుకూలంగా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. తహసీల్దార్ విజయారెడ్డి కుటుంబసభ్యులతో పాటు మృతిచెందిన డ్రైవర్ కుటుంబాన్ని, చికిత్స పొందుతున్న అటెండర్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఆయన వారికి హామినిచ్చారు.

కొన్ని సంఘాల నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు: వంగ రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్‌లు మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ తమకు కొండంత ధైర్యం ఇచ్చారని సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లపై ఉన్న నమ్మకంతో తాము బుధవారం నుంచి విధుల్లో చేరుతామని వారు పేర్కొన్నారు. 15 రోజుల్లో సిఎం కెసిఆర్ ఉద్యోగుల కోసం మంచి నిర్ణయం తీసుకుంటారని వారు పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి బుధవారం నుంచి తప్పకుండా విధుల్లో చేరాలని వారు విజ్ఞప్తి చేశారు.

కొందరు రెవెన్యూ సంఘాల నాయకులు ఉద్యోగులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని వారి మాటలను నమ్మవద్దని వారు విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే ట్రెసా తరఫున భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీష్, టిడివిఆర్‌ఓల అధ్యక్షుడు రవి నాయక్, విఆర్‌ఓల సంఘం అధ్యక్షుడు విజయారావు, టిడివిఆర్‌ఎల సంఘం రమేష్ బహదూర్ , గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

KTR Guarantee for Revenue staff

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెవెన్యూ సిబ్బందికి కెటిఆర్ అభయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: