కపిల్‌దేవ్‌ను తలపించిన రణవీర్

  భారతదేశ క్రికెట్ చరిత్రలో 1983 ఏడాదిని మరచిపోలేం. కపిల్‌దేవ్ నాయకత్వంలో వెస్టీండీస్ టీమ్‌పై విజయాన్ని సాధించి క్రికెట్ విశ్వవిజేతగా భారతదేశం నిలిచిన సంవత్సరమది. ఈ అసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై ‘83’ సినిమాగా ఆవిష్కరిస్తున్నారు దర్శకుడు కబీర్‌ఖాన్. రిలయన్స్ ఎంటర్‌టైన్ బ్యానర్ సమర్పణలో 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్, దీపికా పదుకునే, సాజిద్ నడియాడ్‌వాలా, కబీర్‌ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ […] The post కపిల్‌దేవ్‌ను తలపించిన రణవీర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారతదేశ క్రికెట్ చరిత్రలో 1983 ఏడాదిని మరచిపోలేం. కపిల్‌దేవ్ నాయకత్వంలో వెస్టీండీస్ టీమ్‌పై విజయాన్ని సాధించి క్రికెట్ విశ్వవిజేతగా భారతదేశం నిలిచిన సంవత్సరమది. ఈ అసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై ‘83’ సినిమాగా ఆవిష్కరిస్తున్నారు దర్శకుడు కబీర్‌ఖాన్. రిలయన్స్ ఎంటర్‌టైన్ బ్యానర్ సమర్పణలో 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్, దీపికా పదుకునే, సాజిద్ నడియాడ్‌వాలా, కబీర్‌ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్ డ్రామాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ సినిమా కోసం రణవీర్ సింగ్ కపిల్‌దేవ్‌లా మేకోవర్ అయ్యారు. తన శరీరాకృతిని ఓ క్రీడాకారుడిగా మార్చుకోవడానికి ఆయన పడ్డ కష్టం మనకు తెరపై కనపడుతుంది. అభిమానుల కోసం కపిల్‌దేవ్‌లా ఉన్న రణవీర్‌సింగ్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అది కూడా కపిల్ ట్రేడ్‌మార్క్ క్రికెట్ షాట్ నటరాజ్ స్టిల్‌ను ఫిల్మ్‌మేకర్స్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌లా రణవీర్ సింగ్, సునీల్ గవాస్కర్‌లా తాహిర్ రాజ్‌బాసిన్, మదన్‌లాల్‌గా హార్డీ సంధు, మహీందర్ అమర్‌నాథ్‌గా షకీబ్ సలీమ్, కృష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో కపిల్‌దేవ్ భార్య రోమీ పాత్రలో దీపికాపదుకునే అతిథి పాత్రలో నటిస్తున్నారు.

Ranveer look like as a Kapil Dev

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కపిల్‌దేవ్‌ను తలపించిన రణవీర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: