ట్రిబ్యూట్ టు రంగీలా

  రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం ‘బ్యూటిఫుల్’. ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ఉప శీర్షిక. నైనా కథానాయికగా సూరి కధానాయకుడిగా నటిస్తున్నారు. అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడిస్తూ… “ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ , మొదటి సింగల్‌కి విశేషమైన స్పందన లభించింది. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్ని […] The post ట్రిబ్యూట్ టు రంగీలా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం ‘బ్యూటిఫుల్’. ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ఉప శీర్షిక. నైనా కథానాయికగా సూరి కధానాయకుడిగా నటిస్తున్నారు. అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడిస్తూ… “ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ , మొదటి సింగల్‌కి విశేషమైన స్పందన లభించింది. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. సూరి, నైనా తమ పాత్రలలో ఒదిగిపోయారు. సన్నివేశాలతో పాటు పాటలు హత్తుకుంటాయి” అని తెలిపింది. ఈ చిత్రానికి పాటలను సిరాశ్రీ అందించగా సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.

Ram Gopal varma latest movie Beautiful

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ట్రిబ్యూట్ టు రంగీలా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: