ఎంఎంటిఎస్ రైలు ప్రమాద సంఘటనలో డిఆర్‌ఎఫ్ కీలక పాత్ర

హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఇంటర్ సిటీ, ఎంఎంటిఎస్ రైళ్ళు ఢీ కొన్న సంఘటన స్థలానికి జిహెచ్‌ఎంసి డిజాస్టర్ రెస్కూ బృందాలు అతి తక్కువ సమయంలో చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంపై నగర వాసుల నుంచి అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ఉదయం జరిగిన కాచిగూడ రైల్వే ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే డిఆర్‌ఎఫ్‌కు చెందిన 50 మందితో కూడిన మూడు బృందాలు గ్యాస్‌కట్టర్లు, ఇతర పరికరాలతో చేరుకుని ఎన్‌డిఆర్‌ఎఫ్ , రైల్వే , విపత్తుల నివారణ […] The post ఎంఎంటిఎస్ రైలు ప్రమాద సంఘటనలో డిఆర్‌ఎఫ్ కీలక పాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఇంటర్ సిటీ, ఎంఎంటిఎస్ రైళ్ళు ఢీ కొన్న సంఘటన స్థలానికి జిహెచ్‌ఎంసి డిజాస్టర్ రెస్కూ బృందాలు అతి తక్కువ సమయంలో చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంపై నగర వాసుల నుంచి అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ఉదయం జరిగిన కాచిగూడ రైల్వే ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే డిఆర్‌ఎఫ్‌కు చెందిన 50 మందితో కూడిన మూడు బృందాలు గ్యాస్‌కట్టర్లు, ఇతర పరికరాలతో చేరుకుని ఎన్‌డిఆర్‌ఎఫ్ , రైల్వే , విపత్తుల నివారణ శాఖ సిబ్బందితో కలిసి సహాయక చర్యలను చేపట్టాయి. ముఖ్యంగా సంఘటనలో జిహెచ్‌ఎంసి డిఆర్‌ఎఫ్ విభాగం వద్ద ఉన్న పరికారాలతోనే సహయక చర్యలు చేపట్టడం జరిగింది. క్షతగాత్రులను హస్పటల్‌కు తరలించడంలో డిఆర్‌ఎఫ్ బృందాలు కీలక పాత్ర పోషించాయి.

Two Trains collide near Kacheguda railway station

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎంఎంటిఎస్ రైలు ప్రమాద సంఘటనలో డిఆర్‌ఎఫ్ కీలక పాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: