ఎవరి జోక్యాన్నీ సహించను!

  సినిమా రంగం పూర్తిగా పురుషులకే సొంతమైన ప్రదేశం అయితే నా వరకు నేనెప్పుడూ ఎవరి జోక్యాన్నీ సహించలేను. కథల ఎంపిక నా ఇష్టమే. కథ నచ్చకపోతే సినిమా చేయను. ఎలాంటి మొహమాటాలకు పోను. ఈ రంగంలోకి వచ్చాక కొద్ది కాలానికే నేనో నిర్ణయం తీసుకొన్నాను. షూటింగ్స్, కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో నిర్ణయం నాదే. నాకెంత దగ్గర వాళ్ళయినా జోక్యం చేసుకొంటే ఒప్పుకోను. నేను నటించిన సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా బాధ్యత నాదే. ఈ […] The post ఎవరి జోక్యాన్నీ సహించను! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సినిమా రంగం పూర్తిగా పురుషులకే సొంతమైన ప్రదేశం అయితే నా వరకు నేనెప్పుడూ ఎవరి జోక్యాన్నీ సహించలేను. కథల ఎంపిక నా ఇష్టమే. కథ నచ్చకపోతే సినిమా చేయను. ఎలాంటి మొహమాటాలకు పోను. ఈ రంగంలోకి వచ్చాక కొద్ది కాలానికే నేనో నిర్ణయం తీసుకొన్నాను. షూటింగ్స్, కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో నిర్ణయం నాదే. నాకెంత దగ్గర వాళ్ళయినా జోక్యం చేసుకొంటే ఒప్పుకోను. నేను నటించిన సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా బాధ్యత నాదే. ఈ సినిమా రంగం నన్ను సూపర్ స్టార్‌ని చేసింది. దాన్ని నేను నిరంతరం నిలబెట్టుకోవాలి. ప్రస్తుతం నేను చేస్తున్న పని అదే. అవసరానికి మించి గ్లామర్‌గా కనిపించటం కూడా నాకు ఇష్టం లేదు. గ్లామర్ పేరుతో అసభ్యతను నేనసలు సహించను అంటోంది నయనతార.

* పుట్టింది: నవంబర్ 18, 1984
* అసలు పేరు : డయానా మారియమ్ కురియన్
* పుట్టిన ఊరు :
* అవార్డులు : కలైమణి, నంది అవార్డులు, తమిళనాడు రాష్ట్ర ఫిల్మీ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
* బిరుదులు: మలయాళం, తెలుగు చిత్రాల్లో నటిస్తోన్న నయనతారను లేడీ సూపర్‌స్టార్, తలైవీ అని పిలుచుకుంటారు అభిమానులు.
* తల్లిదండ్రులు: కురియన్ కొడియ, సిరియన్.
* మొదటి చిత్రం: చేసే సమయంలో ‘మనస్సినక్కరే’ అనే మలయాళీ సినిమాలో తొలిసారిగా నటించింది.
* పేరు తెచ్చిన చిత్రాలు: అయ్య, చంద్రముఖి, గజిని, తెలుగులో లక్ష్మీ, బాస్ చిత్రాలు.
* అజిత్‌తో చేసిన బిల్లా సెక్సీయస్ట్ హీరోయిన్‌గా పేరుతెచ్చింది.
* బాపు చిత్రం శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులు లభించాయి.
* సిరియన్ క్రిస్టియన్ అయిన నయన్ 2011లో హిందూమతాన్ని స్వీకరించింది.

 

Nayanthara success story

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎవరి జోక్యాన్నీ సహించను! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.