‘ఎదుగుదల’లేని బాల్యం!

  పోషకాహార లోపం ఒక శాపం, మూలాలను తొలగించాలి. పోషకాహార లోపం శిశువులకు శాపంగా మారుతోంది. పర్యవసానంగా రాష్ట్రంలో తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారు. ఇటీవలి కాలం లో, భారతదేశంలో పోషకాహారం చుట్టూ తాజా చర్చ జరిగింది. కొన్ని నెలల క్రితం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేషనల్ హెల్త్ పాలసీ, 2017 విడుదల చేసింది. ఇది జనాభా ఉత్పాదకతపై పోషకాహార లోపాన్ని ప్రతికూల ప్రభావాన్ని చూపింది, దేశంలో మరణాల రేటుకు ఇది దోహదపడింది. పోషకాహారలోపం […] The post ‘ఎదుగుదల’లేని బాల్యం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పోషకాహార లోపం ఒక శాపం, మూలాలను తొలగించాలి. పోషకాహార లోపం శిశువులకు శాపంగా మారుతోంది. పర్యవసానంగా రాష్ట్రంలో తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారు. ఇటీవలి కాలం లో, భారతదేశంలో పోషకాహారం చుట్టూ తాజా చర్చ జరిగింది. కొన్ని నెలల క్రితం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేషనల్ హెల్త్ పాలసీ, 2017 విడుదల చేసింది. ఇది జనాభా ఉత్పాదకతపై పోషకాహార లోపాన్ని ప్రతికూల ప్రభావాన్ని చూపింది, దేశంలో మరణాల రేటుకు ఇది దోహదపడింది. పోషకాహారలోపం దీర్ఘకాలిక ప్రభావాల నేపథ్యంలో, తరాల అంతటా, నీతి ఆయోగ్ (Niti Ayogh) నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీని విడుదల చేసింది. ఈ పోస్ట్ భారతదేశంలో పోషకాహార లోపం ప్రస్తుత స్థితి, ఈ వ్యూహం ప్రతిపాదించిన చర్యలు అందిస్తున్నది.

దేశాభివృద్ధి సాధించాలంటే ప్రజల పోషణ, పోషకాహారలోప నిర్మూలనే కాకుండా త్వరితగతిన పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడం మన విధి. దేశాభివృద్ధికి జనాభా ఒక సమస్య కాకూడదు. వారి ఉత్పాదక శక్తి పెరిగితే ప్రజలే మన పెట్టుబడి అవుతారు. ప్రపంచంలోనే అత్యధికంగా పొషకాహారలోపం ఉన్న దేశంగా మన దేశానికి ముద్ర పడింది. భారత రాజ్యాంగంలో 47వ అధికరణ పోషకాహార స్ఠాయిని పెంచడం, జీవన ప్రమాణాలు, ప్రజల ఆరోగ్య మెరుగుదలను గురించి వివరిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ప్రధాన పోషకాహార లోపం సూచికలపై భారతదేశం పనితీరు పేలవంగా ఉంది. UNICEF ప్రకారం, భారత్‌లో అత్యధిక సంఖ్యలో బరువున్న పిల్లలతో ఉన్న దేశాల్లో భారతదేశం 10 వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో తక్కువగా ఉన్న పిల్లల కోసం 17 వ స్థానంలో ఉంది.

వ్యక్తులందరూ శారీరక, మానసిక ఆరోగ్యాలతో ఉంటేనే సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. భావి భారత పౌరులను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే భారత ప్రభుత్వం సమగ్ర మాతా శిశు అభివృద్ధి పథకాన్ని ప్రారంభించి కోట్ల మంది పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకూ పోషకాహారాన్ని అందిస్తూ వారికి మెరుగైన ఆరోగ్యాన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తోంది. పేదరికం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న మన దేశంలో అందరికీ పోషకాహారం అందించాలన్న లక్ష్యసాధనలో ఆశించిన విధంగా కొంత మేర విజయం సాధించింది. పోషకాహార లోపాన్ని నియంత్రిస్తే ప్రజల ఉత్పాదకత శక్తి పెరిగి దేశ ఆర్ధికాభివృద్ది జరుగుతుంది. ఆహార భద్రత మెరుగుపరచడానికి ఆహారోత్పత్తి, సాంకేతిక అభివృద్దికి మాత్రమే మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చారు.

ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్), ప్రత్యేక పోషకాహార కార్యక్రమం, గిరి గోరుముద్దలు వంటి కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపడుతున్నా ఈ సమస్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మాతా శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోందని చెబుతున్న ప్రభుత్వం, పోషకాహార లోపాన్ని మాత్రం అధిగమించలేకపోతోంది. ఫలితంగా ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువుతో జన్మించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పెరుగుతున్న పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగమే ఇందుకు ప్రధాన కారణాలని పలువురు సామాజికవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా నిరుద్యోగం కారణంగా చాలా మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారని విశ్లేషిస్తున్నారు. సరైన పోషకాహారం తీసుకునేందుకు ఈ సమస్యలే అడ్డొస్తున్నాయని చెబుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పూర్తి స్థాయిలో గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేస్తే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుందని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.

నేటి బాలలే రేపటి పౌరులు అటువంటి పౌరులు ఉత్పాదకశక్తి కలిగి వుంటే వారిని మించిన పెట్టుబడి మరొకటి లేదు. మన దేశంలో మూడవ వంతు దాదాపు 30 శాతం మంది పిల్లలు సాధారణం కంటే తక్కువ బరువుతో 2.5 కిలోల బరువు కంటే తక్కువగా జన్మిస్తున్నారు. వీరు సాధారణ బరువుతో జన్మించే పిల్లల కంటే పోషకాహార లోపానికి, ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. పట్టణాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. నిరక్షరాస్యులైన తల్లులకు జన్మించిన పిల్లలు ఐదురెట్లు తక్కువ బరువు లోపంతో బాధపడుతున్నారు. శరీరానికి కావాలసిన పోషకాలు పిండి పదార్ధాలు, మాంసకృతులు, కొవ్వు, విటమిన్ ఖనిజ లవణాలు వీటితో పాటు శరీరానికి నీరు కూడా ఎంతో అవసరం. ఈ పోషకాలన్నింటిని తగిన పరిమాణంలో శరీరానికి అందించే ఆహారమే సమతుల ఆహారం లేక సంపూర్ణ ఆహారం.
నిత్యజీవితంలో డబ్బు ఎంత అవసరమో ప్రతి మనిషికి ఆరోగ్యంగా ఉండటానికి విలువలున్న ఆహారం కూడా అంతే అవసరం. మన దేశంలో 20 శాతం మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో బాధపడే వారిలో ప్రపంచంలో మూడవ వంతు మంది మన దేశంలో ఉన్నారు. దేశంలో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో 43 శాతం మంది పిల్లలు సరైన ఎదుగుదల లేకుండా ఉన్నారు. ఎదుగుదల లేకుండా జన్మిస్తున్న వారిలో ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ముగ్గురు భారత్‌లోనే ఉన్నారు.

బాలల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి రాష్ట్ర పథక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ ఔట్రీచ్ కార్యక్రమాలతో సహా, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్), పిల్లల్లో పోషకాహారం కింద ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రజా ఆరోగ్య నిపుణులు చెబుతారు. సరఫరా, శిక్షణ పొందిన సిబ్బందికి సంబంధించి ఎపి, టిఎస్ లలో అంగన్ వాడీ కేంద్రాలలో అవస్థాపన లేకపోవడం గమనించబడింది. కార్యక్రమ స్థిరత్వం లేదా విశ్వసనీయతపై హానికరమైన ప్రభావాన్ని కలిగి ఉన్న అంగన్ వాడీ కార్మికుల తగని దృష్టి కూడా ఉంది. టిఎస్, ఎపిలలో ఇప్పటికే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు తగినంతగా సహాయకులు, అంగన్ వాడీ కార్మికులు లేరు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ సంస్థ తాజా నివేదిక ప్రకారం దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లల్లో పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉందన్న గణాంకాలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ వర్గాల కోసం ఉపప్రణాళిక నిధుల కింద కేటాయిస్తున్న నిధులలో 30 శాతం కూడా ఖర్చు కావడం లేదన్న విషయం ఆందోళనకరం. జాతీయ బాలల నివేదిక 2018 ప్రకారం తెలుగు రాష్ట్రాలలోను చిన్నారుల ఆరోగ్యస్థితిగతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కమిషన్లు ఏర్పాటు కాలేదు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఆహార పదార్థాలను తప్పనిసరిగా అందచేయాలి.పేదరికం ఎన్ని రూపాల్లో ఉన్నా తొలగించడానికి దేశంలో పలురకాల పథకాలున్నయి. వీటిలో ఏ ఒక్కటి కూడా ఒక మనిషికి వ్యక్తిగతంగా కాని, ఒక కుటుంబానికి కానీ కనీస స్థాయిలో పౌష్టికాహారాన్ని అందించలేకపోతున్నాయి. కోట్లాది నిరుపేద కుటుంబాలకు విస్తృత ఉపాధి అవకాశాలను చేరువ చేయాలి. అప్పుడే ఈ సమస్యకు కొంతైనా పరిష్కారమార్గం చూపించగలం.

Child malnutrition still prevalent in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘ఎదుగుదల’లేని బాల్యం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: