బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ చట్టం అమలు

  వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుండి 2019 అగస్టు నెలాఖరు వరకు ఉద్దేశ్యపూర్వకంగా రూ. 75 కోట్ల 42 లక్షలు ఎగవేసినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలిపారు. ఈ సొమ్ములో 2 కోట్ల 34 లక్షలు వసూలు కాగా, ఇంకా 73 కోట్ల 7 లక్షలను వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు […] The post బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ చట్టం అమలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్

వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుండి 2019 అగస్టు నెలాఖరు వరకు ఉద్దేశ్యపూర్వకంగా రూ. 75 కోట్ల 42 లక్షలు ఎగవేసినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలిపారు. ఈ సొమ్ములో 2 కోట్ల 34 లక్షలు వసూలు కాగా, ఇంకా 73 కోట్ల 7 లక్షలను వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను వర్తింపజేయాలని ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ నందు ఆదాయార్జన శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రెగ్యులర్‌గా ఇచ్చే నోటీసులతో ఉపయోగం లేదని తెలిపారు. అధికారులు వ్యక్తిగతంగా ప్రతి కేసును మానిటరింగ్ చేయాలని తెలిపారు. రెండు నెలల్లో నూరు శాతం బకాయిలు వసూలు చేయాలని తెలిపారు. 2014 నుండి ప్రతి సంవత్సరం ఉన్న బకాయిదారుల జాబితాను తీసుకొని పెద్ద మొత్తంలో ఎగవేసిన వారిని దృష్టి సారించాలని సూచించారు.

ఈ నెలాఖరుకు 50 శాతం బకాయిలు వసూలు కావాలని తెలిపారు. ఈ అంశంపై ప్రతి 15 రోజులకొకసారి సమీక్షించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొన్ని శాఖలలో కోట్ల రూపాయల ఎగవేతలు ఉన్నప్పటికి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్ను ఎగవేతదారులను సుమోటోగా గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. కామన్ గుడ్‌ఫండ్ క్రింద దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 51 ఆలయాల కార్యనిర్వహణాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. హోటల్స్, కిరాణషాపులు, రైల్‌మిల్స్ నుండి ఆహార భద్రత శాఖకు రావాల్సిన ఫుడ్ సేప్టి లైసెన్స్ ఫీజు ఎగవేతల వసూలుకు చేపట్టిన చర్యలు శూన్యమని అభిప్రాయపడ్డారు.

గుడ్డిగా వ్యాపారస్తులు చెప్పిన టర్నోవర్‌ను ఎలా పరిగణలోనికి తీసుకుంటారని ప్రశ్నించారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుండి టర్నోవర్ వివరాలు తీసుకొని పన్ను ఎగవేతలను అరికట్టాలని తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజుల ఎగవేత బకాయిలను వసూలు చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వరంగల్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. మైనింగ్‌శాఖ పన్ను ఎగవేతలు రూ. 48 లక్షలు ఉన్నప్పటికి సరైన విధంగా స్పదించుట లేదని అన్నారు. పన్ను ఎగవేసిన 52 కేసులపై ప్రత్యేక దృష్టి సారించాని వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌ఫోర్ట్ బకాయిల వసూళ్లలో భాగంగా రోడ్ పర్మిట్స్‌ను రద్దు చేయించాలని తెలిపారు.

అక్రమ లేఅవుట్‌లు, వెంచర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాలా కన్వర్షన్ పన్నులను నూరుశాతం వసూలు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ మనూ చౌదరి, డిఆర్‌ఒ పి మోహన్‌లాల్, ఆర్డిఓ కె వెంకారెడ్డి, వరంగల్ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్‌రావు, ప్రాం తీయ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఎఎస్‌పి బి శ్రీనివాస్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అధికారి సుధాకర్‌రెడ్డి, దేవాదాయశాఖ, కుడా, ఫైర్‌సేప్టి, మైనింగ వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Enforcement of Revenue Recovery Act to collect arrears

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ చట్టం అమలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: