బంగ్లా బౌలర్లను ఉతికారేసిన రోహిత్‌పై ప్రశంసల జల్లు…

రాజ్‌కోట్: మూడు టీ20 సిరీస్ లో భాగంగా గురువారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టి20లో టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్ తో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన 100వ టీ20 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రోహిత్ పై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచంలోనే రోహిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదని, ఫార్మాట్ ఏదైనా రోహిత్‌కు ఎదురు లేకుండా పోతోందని..  అతన్ని ఆపడం […] The post బంగ్లా బౌలర్లను ఉతికారేసిన రోహిత్‌పై ప్రశంసల జల్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాజ్‌కోట్: మూడు టీ20 సిరీస్ లో భాగంగా గురువారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టి20లో టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్ తో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన 100వ టీ20 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రోహిత్ పై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచంలోనే రోహిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదని, ఫార్మాట్ ఏదైనా రోహిత్‌కు ఎదురు లేకుండా పోతోందని..  అతన్ని ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు శక్తికి మించిన పనిగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా రోహిత్ ఇలాంటి జోరునే కొనసాగించాలని వారు కోరుకుంటున్నారు. మాజీ క్రికెటర్లు సైతం రోహిత్ బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించారు. రోహిత్ ను ఆపడం మా వల్ల కాలేదని బంగ్లా కెప్టెన్ కూడా ఒప్పుకున్నాడు.

కాగా, తప్పకసరి గెలువాల్సిన రెండో టి20లో రోహిత్(85; 6 ఫోర్లు, 6 సిక్స్ లు) సునామి సృష్టించడంతో బంగ్లాదేశ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. దీంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.  తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొందిన విషయం తెలిసింది. మూడో టీ20 మ్యాచ్ ఆదివారం నాగ్ పూర్ లో జరగనుంది.

Fans Praises on Rohit Sharma on Social Media

The post బంగ్లా బౌలర్లను ఉతికారేసిన రోహిత్‌పై ప్రశంసల జల్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: