మిషన్ భగీరథ గేట్‌వాల్ గుంతలో పడి యువకుడు మృతి

  మహబూబాబాద్ : మిషన్ భగీరథ త్రాగు నీటి కోసం ఏర్పాటు చేసిన గేట్‌వాలు గుంతలో పడి యవకుడు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి బంజర గ్రామంలో చోటుచేసుకుంది. బందువుల కథనం ప్రకారం నెల్లికుదురు మండంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన షేక్ ముస్తఫా (32) బ్రతుకుదెరువు నిమిత్తం జిల్లా కేంద్రమైన మానుకోటలోని ధర్మన్న కాలనీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనుల నిమిత్తం మండలంలోని బంజర గ్రామానికి వచ్చి పనులు ముగించుకోని సాయంత్రం తిరిగి వెళ్లాడానికి […] The post మిషన్ భగీరథ గేట్‌వాల్ గుంతలో పడి యువకుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబాబాద్ : మిషన్ భగీరథ త్రాగు నీటి కోసం ఏర్పాటు చేసిన గేట్‌వాలు గుంతలో పడి యవకుడు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి బంజర గ్రామంలో చోటుచేసుకుంది. బందువుల కథనం ప్రకారం నెల్లికుదురు మండంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన షేక్ ముస్తఫా (32) బ్రతుకుదెరువు నిమిత్తం జిల్లా కేంద్రమైన మానుకోటలోని ధర్మన్న కాలనీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనుల నిమిత్తం మండలంలోని బంజర గ్రామానికి వచ్చి పనులు ముగించుకోని సాయంత్రం తిరిగి వెళ్లాడానికి గ్రామంలోని స్టేజీ వద్దకు వచ్చి నీటి సరఫర కోసం ఏర్పాటు చేసిన గుంతపైన కూర్చోని ప్రమాదవావాత్తు వెనకకి పడడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు.

మృతుడికి భార్య ఫర్జాన, ఇద్దరు కుమారులు ఉన్నారు . కాగా మిషన్ భగీరథ కాంట్రాక్టర్ గేటువాలుపై మూత బిగించకపోవడం వలనే ప్రమాధం జరిగిందని మృతదేవహాన్ని అక్కడే ఉంచి నష్టపరిహారం చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై కందు ఫనిధర్ సంఘటన స్థలానికి చేరుకోని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని అన్నివిదాలుగా ఆదుకోవాలని జడ్పిటిసి ముకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపిపి ఎర్రబెల్లి మాదవి, సర్పంచ్‌లు చిర్ర జనార్దన్ రెడ్డి, డొనికెన జ్యోతీ శ్రీనివాస్ గౌడ్‌లు ప్రభుత్వాన్ని కోరారు.

Young man died by falling in Mission Bhagiratha ditch

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మిషన్ భగీరథ గేట్‌వాల్ గుంతలో పడి యువకుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: