ముస్తాబాద్‌లో పర్యటించిన మంత్రి కెటిఆర్

  రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ముస్తాబాద్‌లో శుక్రవారం పర్యటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెటిఆర్ మొదటిసారిగా  మండలానికి రావడంతో కార్యకర్తలు మండల నాయకులు, సర్పంచ్‌లు నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ముందుగా కోటి 20లక్షల నిధులతో నిర్మితమైన 33/11 కెవి సామర్థ్యం కలిగన సబ్ స్టేషన్ ని, అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. రాష్ట్ర నాయకుడు వెన్నమనేని శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో 14 లక్షలు వెచ్చించి […] The post ముస్తాబాద్‌లో పర్యటించిన మంత్రి కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ముస్తాబాద్‌లో శుక్రవారం పర్యటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెటిఆర్ మొదటిసారిగా  మండలానికి రావడంతో కార్యకర్తలు మండల నాయకులు, సర్పంచ్‌లు నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ముందుగా కోటి 20లక్షల నిధులతో నిర్మితమైన 33/11 కెవి సామర్థ్యం కలిగన సబ్ స్టేషన్ ని, అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. రాష్ట్ర నాయకుడు వెన్నమనేని శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో 14 లక్షలు వెచ్చించి అంబులెన్స్‌ను కొనుగోలు చేశాడు.

తన స్వగ్రామంలో నిరుపేదలకి సరైన సమయంలో చికిత్స అందాలనే ఆలోచనతో అంబులెన్స్ సేవలను అందించడం గొప్ప విషయం అని శ్రీనివాసరావుని కెటిఆర్ అభినందించారు. అనంతరం ఇందిరమ్మకాలనీలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన షాదీఖానాను ప్రారంభించాడు. ముస్లిం పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఈ షాదీఖానా మంచి వేదిక అవ్వనుంది. తదానంతరం గూడెంలోని ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసిన మాజి ఎఎంసి చైర్మన్ ఆంజనేయరావు ఇంటికి విచ్చేసాడు.

Minister KTR visited in Mustafabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముస్తాబాద్‌లో పర్యటించిన మంత్రి కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: