బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రజనీ, కమల్

చెన్నయ్ : ప్రముఖ దర్శకుడు దివంగత బాలచందర్ విగ్రహాన్ని కోలీవుడ్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ లు ఆవిష్కరించారు. రజనీ, కమల్ ను వెండితెరకు పరిచయం చేసింది బాలచందర్ అన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ కోసం చెన్నయ్ లో  నూతన కార్యాలయాన్న నిర్మించారు. ఈ కార్యాలయంలోనే బాలచందర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బాల చందర్ విగ్రహాన్ని రజనీతో కలిసి కమల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజనీ, కమల్ […] The post బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రజనీ, కమల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : ప్రముఖ దర్శకుడు దివంగత బాలచందర్ విగ్రహాన్ని కోలీవుడ్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ లు ఆవిష్కరించారు. రజనీ, కమల్ ను వెండితెరకు పరిచయం చేసింది బాలచందర్ అన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ కోసం చెన్నయ్ లో  నూతన కార్యాలయాన్న నిర్మించారు. ఈ కార్యాలయంలోనే బాలచందర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బాల చందర్ విగ్రహాన్ని రజనీతో కలిసి కమల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజనీ, కమల్ లు పరస్పరం అభినందించుకున్నారు. కమల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ , సినిమా రంగాన్ని వీడలేదని, కళను ఆయన అనునిత్యం అనుసరిస్తూనే ఉంటారని రజనీ పేర్కొన్నారు. రజనీ, తాను పరస్పరం గౌరవించుకుంటామని, విమర్శించుకుంటామని, ఒకరి పనిని మరొకరు ఇష్టపడుతూనే ఉంటామని కమల్ తెలిపారు. తమ సినీ, రాజకీయ జీవితాలు శుభప్రదంగా ఉంటాయనే నమ్మకం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రజనీ మీడియాతో మాట్లాడారు. తనకు బిజెపితో ఎటువంటి సంబంధం లేదని, తాను బిజెపి వ్యక్తిని కానని స్పష్టం చేశారు.

Rajini and Kamal Unveil Statue of Director Balachander

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రజనీ, కమల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: