సిఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా

ముంబయి : శనివారంతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో సిఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం రాజీనామా చేశారు. తన మంత్రివర్గ సహచరులతో ఆయన గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిసి రాజీనామా లేఖను అందించారు. తన రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ఫడ్నవీస్ తెలిపారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. రెండో స్థానంలో శివసేన నిలిచింది. ఈ రెండు మిత్రపక్షాలు అన్న విషయం తెలిసిందే. అయితే సిఎం […] The post సిఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : శనివారంతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో సిఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం రాజీనామా చేశారు. తన మంత్రివర్గ సహచరులతో ఆయన గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిసి రాజీనామా లేఖను అందించారు. తన రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ఫడ్నవీస్ తెలిపారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. రెండో స్థానంలో శివసేన నిలిచింది. ఈ రెండు మిత్రపక్షాలు అన్న విషయం తెలిసిందే. అయితే సిఎం పదవి తమకే కేటాయించాలని శివసేన డిమాండ్ చేస్తుండడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని బిజెపి గవర్నర్ ను కోరలేదని తెలుస్తోంది. అయితే మహారాష్ట్ర సిఎంగా శివసేనకు చెందిన వారే ఉంటారని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తేల్చి చెబుతున్న విషయం విదితమే. అయితే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Fadnavis Resigns To CM Post In Maharashtra

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: