టిక్‌టాక్…భార్యను చంపిన భర్త

అమరావతి: టిక్‌టాక్ వీడియోల మోజులో పడి భర్త చేతిలో భార్య ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి పోలీస్ స్టేషన్‌లో పరధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాహిబ్ అనే వ్యక్తి టైలర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య పాతిమా ఇంటి వద్దే ఉంటుంది. ఆమె టిక్‌టిక్ మోజులో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పలుమార్లు భర్త మందలించాడు. టిక్‌టిక్ వీడియోలను క్రియేట్ చేసి అదే యాప్‌లో ఆప్‌లోడ్ చేసేది. దీంతో […] The post టిక్‌టాక్… భార్యను చంపిన భర్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి: టిక్‌టాక్ వీడియోల మోజులో పడి భర్త చేతిలో భార్య ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి పోలీస్ స్టేషన్‌లో పరధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాహిబ్ అనే వ్యక్తి టైలర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య పాతిమా ఇంటి వద్దే ఉంటుంది. ఆమె టిక్‌టిక్ మోజులో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పలుమార్లు భర్త మందలించాడు. టిక్‌టిక్ వీడియోలను క్రియేట్ చేసి అదే యాప్‌లో ఆప్‌లోడ్ చేసేది. దీంతో టిక్‌టాక్ మరిచిపోవాలని భార్యకు భర్త పలుమార్లు సూచించాడు. భర్త మాటలు వినకపోవడంతో ఆమె గొంతుకు చీరతో ఉరేసి చంపేశాడు. అనంతరం అదే చీరను ఫ్యాన్‌కు కట్టి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆత్మహత్యగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టమ్‌లో అది ఆత్మహత్య కాదని హత్య అని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి భర్త పరారీలో ఉండడంతో అతడిపై అనుమానం పెట్టుకున్నారు. పోలీసులు నిందితుడి అచూకీ తెలుసుకొని పట్టుకున్నారు. పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించగా నిందితుడు హత్యా చేశానని ఒప్పుకున్నాడు.

 

Husband Killed his Wife with Tik Tok Video Issue

The post టిక్‌టాక్… భార్యను చంపిన భర్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: