మొలకల శాండ్‌విచ్

  మొలకల శాండ్‌విచ్ కావాల్సినవి : పెసరమొలకలు: కప్పు, మెంతికూర: కట్ట, పచ్చిమిర్చి: అయిదారు, బ్రౌన్ లేదా వైట్ బ్రెడ్ స్లైసులు ఏడెనిమిది, చక్రాల్లా తరిగిన టమోటా, ఉల్లిపాయ, క్యారెట్టు, కీనదోస ముక్కలు కొన్ని, చీజ్ స్లైసులు ఏడెనిమిది, నూనె, ఉప్పు, టమోటా సాస్ అరకప్పు. తయారీ : మొలకలు, మెంతి ఆకులు, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీలో తీసుకుని దాన్ని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ సైసును తీసుకుని దానిపై కొద్దిగా నూనె రాసి మొలకల […] The post మొలకల శాండ్‌విచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మొలకల శాండ్‌విచ్

కావాల్సినవి : పెసరమొలకలు: కప్పు, మెంతికూర: కట్ట, పచ్చిమిర్చి: అయిదారు, బ్రౌన్ లేదా వైట్ బ్రెడ్ స్లైసులు ఏడెనిమిది, చక్రాల్లా తరిగిన టమోటా, ఉల్లిపాయ, క్యారెట్టు, కీనదోస ముక్కలు కొన్ని, చీజ్ స్లైసులు ఏడెనిమిది, నూనె, ఉప్పు, టమోటా సాస్ అరకప్పు.

తయారీ : మొలకలు, మెంతి ఆకులు, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీలో తీసుకుని దాన్ని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ సైసును తీసుకుని దానిపై కొద్దిగా నూనె రాసి మొలకల పేస్టును జామ్ రాసినట్టు రాయాలి. ఇప్పుడు పెనం వేడిచేసి ఈ స్లైసును రెండువైపులా కాల్చాలి. మొలకల పేస్టు రాసిన వైపున కొద్దిగా టొమాటో సాస్ రాసి దానిపైన క్యారెట్, టొమాటో, ఉల్లిపాయ, కీరదోస, చీజ్ స్లైస్ ఉంచి దానిపైన పెనంపై కాల్చిన మరో బ్రెడ్ స్లైస్‌ను ఉంచాలి. ఈ శాండ్‌విచ్‌ని పిల్లలకు లంచ్‌బాక్స్‌లో పెట్టివ్వొచ్చు.

చికెన్ శాండ్‌విచ్

కావాల్సినవి : బ్రెడ్ స్లైసులు: పన్నెండు, ఎముకల్లేని చికెన్ ముక్క: ఒకటి పెద్దతి  ( దీన్ని ముక్కల్లా కోసుకోవాలి), ఉల్లిపాయ:ఒకటి, పచ్చిమిర్చి: రెండు, మయొనైజ్: మూడు చెంచాలు( బజార్లో దొరుకుతుంది), పుదీనా తరుగు: చెంచా, చీజ్ స్లైసులు: ఆరు, చిల్లీసాస్: రెండు చెంచాలు, వెన్న:అరకప్పు, ఉప్పు: రుచికి సరిపడా, మిరియాలపొడి చెంచా.

తయారీ: ముందుగా చికెన్ ముక్కలపై మిరియాలపొడీ, పచ్చిమిర్చి, తగినంత ఉప్పువేసి ఉడికించి పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి మిక్సీ పట్టాలి. ఇపుడు పుదీనా తరుగూ, మయొనైజ్, తగినంత ఉప్పూ, చిల్లీసాస్ కలిపి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్ స్లైసుల్ని పెనంపై ఉంచి వెన్నతో కాల్చి తీసుకోవాలి. ఒక స్లైసుపై చీజ్ స్లైసు, ఉల్లిపాయ ముక్క ఉంచాలి. మధ్యలో చికెన్ మిశ్రమాన్ని ఉంచి.. మరో స్లైసుతో మూసేయాలి.

దహీ శాండ్‌విచ్

కావల్సినవి : బ్రెడ్ స్లైసులు: నాలుగు, పెరుగు: రెండు కప్పులు, మయొనైజ్ ( ఎగ్‌లెస్) పావుకప్పు, క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీ తరుగు: అన్నీ కలిపి పావుకప్పూ, ఉడికించిన మొక్కజొన్న గింజలు: రెండు చెంచాలు, మిరియాల పొడి: పావు చెంచా, ఉప్పు: తగినంత.

తయారీ: మొదట పెరుగును శుభ్రమైన, మందమైన కాటన్ వస్త్రంలో తీసుకుని మూటలా కట్టాలి. నీరంతా పోయి గట్టిగా అవుతుంది.
అందులో బ్రెడ్‌స్లైసులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అంచులు కత్తిరించిన ఓ బ్రెడ్ స్లైసును తీసుకుని దానిపై పెరుగు మిశ్రమాన్ని పరిచి, మరో స్లైసు ఉంచాలి. ఇలా మిగిలిన రెండు స్లైసులు చేసుకుంటే చాలు. దీన్ని నచ్చిన ఆకృతిలో కూడా కత్తిరించుకోవచ్చు.
ఇవన్నీ అల్పాహారంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మొలకల శాండ్‌విచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.